వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టులో ఇలా.. రోజా - శిశుపాలుడు!: ఎవరికి దెబ్బ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ విషయంలో ఇటు ప్రతిపక్ష వైసిపి, అటు అధికార తెలుగుదేశం పార్టీలు పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. క్షమాపణ చెప్పేందుకు వైసిపి నో చెబుతుండగా, రోజాను వదిలేసేందుకు టిడిపి సిద్ధంగా లేదు.

అసెంబ్లీయే ఫైనల్, సారీ చెప్పు: సుప్రీంలో రోజాకు చుక్కెదురు, సభకూ సూచనఇప్పటికి కూడా సుప్రీం కోర్టు సూచనల మేరకు రోజా సస్పెన్షన్ అంశానికి 'ఫుల్ స్టాప్' పడే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. టిడిపి, వైసిపి నేతల వ్యాఖ్యలు చూస్తుంటే వారు పట్టువిడుపుతో కాకుండా... ఈ విషయంలో పట్టుదలతో ఆలోచిస్తున్నట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు.

వెంటనే రోజా క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం కూడా ఆమె క్షమాపణను అంగీకరించాలని, కొత్త రాష్టమైన ఏపీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, వాటి పైన దృష్టి సారించాలని సుప్రీం కోర్టు అధికార, విపక్షాలకు హితవు పలికింది. మీరు ఫుల్ స్టాప్ పెట్టకుంటే మేం జోక్యం చేసుకుంటామని కూడా తెలిపింది.

Supreme Courts Shocks Roja and Chandrababu

శాసన సభే సుప్రీం

రోజా సస్పెన్షన్ విషయంలో శాసన సభే సుప్రీం అని, దానికి సర్వాధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సభ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోబోమని, అదంతా స్పీకర్‌ పరిధిలోని అంశమని పేర్కొంది. సభా ధిక్కరణకు సంబంధించిన చర్యలను న్యాయ వ్యవస్థ పునఃసమీక్షించటం మంచిది కాదని వ్యాఖ్యానించింది.

సమీక్ష వరకూ వెళ్లాలని తాము భావించటం లేదని తెలిపింది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రోజా శాసనసభకు క్షమాపణ చెప్పాలని, ఈ మేరకు శుక్రవారంలోపు ఏక వాక్య క్షమాపణ లేఖను స్పీకర్‌కు పంపించాలని సూచించింది. ఆ లేఖను స్పీకర్‌ పరిగణలోకి తీసుకోవాలని హితవు పలికింది.

బాబుపై ద్వేషం లేదు: 'క్షమాపణ'పై రోజా మెలిక, వివాదం కొనసాగేనా?బాబుపై ద్వేషం లేదు: 'క్షమాపణ'పై రోజా మెలిక, వివాదం కొనసాగేనా?

సుప్రీం కోర్టు కూడా శాసన సభే సుప్రీం అని తెలిపింది. దీంతో తాము మొదటి నుంచి చేస్తున్న వాదనకు బలం చేకూరిందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.

రోజాకు చురకలు

ప్రజా ప్రతినిధులు రాజనీతిజ్ఞుల్లా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని, కానీ ఇటీవల అందుకు భిన్నంగా ఎన్నికల ప్రసంగాలు చేసినట్లు అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, ఆగ్రహంతో ఊగిపోతూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, ప్రజా ప్రతినిధులు వ్యవహరించే తీరు ఇదేనా అని జడ్జిలు తప్పుబట్టారు.

సభా ధిక్కరణకు పాల్పడి, సభకు అంతరాయం కలిగిస్తే సభ తీసుకున్న నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకుని, వాటిపై న్యాయ సమీక్ష జరపటం చాలా తీవ్రమైన అంశమని, పార్లమెంటు, అసెంబ్లీలో ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని వారు పేర్కొన్నారు.

ఒక్కోసారి చట్టసభల్లో ఆవేశపూరితమైన చర్చలు జరిగినప్పుడు, సభ్యులు తప్పుగా మాట్లాడితే వెంటనే ఆ తప్పును సవరించుకుంటారని గుర్తు చేశారు. వ్యక్తిగత అహంభావం వల్ల సంఘర్షణ తలెత్తరాదని, సభ తప్పుదోవ పట్టరాదని, చట్ట సభలు యుద్ధ రంగాలు కారాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, ప్రతిపక్షాలు రెండూ ఇదే పద్ధతిలో ముందుకెళ్లాలని సూచించారు.

కొత్త రాష్ట్రంలో సమస్యలెన్నో, రోజా గోల ఏమిటి, ఇద్దరిదీ తప్పే: బాబుకు సుప్రీంన్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ కంటే ప్రజలే అధికులని న్యాయమూర్తులు తెలిపారు. ఈ కేసును న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు తామేమీ సంకోచించడం లేదని, అయితే విస్తృత ప్రజా ప్రయోజనార్థం శాసనసభకు క్షమాపణ చెప్పాలని రోజాకు సూచించారు. రోజాపై తామేమీ ఒత్తిడి తీసుకురావడం లేదని, కేవలం సూచన మాత్రమే చేస్తున్నామన్నారు.

మూడు క్షమాపణలు

ప్రభుత్వం తరఫున హాజరైన లాయర్ పీపీ రావు స్పందిస్తూ.. ఆమె క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ రద్దు చేస్తామని హైకోర్టులోనే చెప్పామని, కానీ ఆమె క్షమాపణ చెప్పడం కుదరదన్నారు. ఇప్పటికైనా ఆమె క్షమాపణ చెబితే సస్పెన్షన్‌ను రద్దు చేసి, సమస్యను ముగించేందుకు సిద్ధమేనని, ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌కు సూచన చేస్తామన్నారు.

అయితే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు తిరిగి చేయబోనని ఆమె హామీ ఇవ్వాలన్నారు. అలా హామీ ఇవ్వటం కుదిరే పని కాదని, ఒకవేళ భవిష్యత్తులో తప్పులు చేస్తే శిక్షించాలని న్యాయమూర్తులు చెప్పారు. రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ స్పందిస్తూ.. ఆమె క్షమాపణ చెబితే మూడు కేసులనూ రద్దు చేయాలన్నారు.

అలా అయితే మూడు వేర్వేరు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వం తరఫు లాయర్ సూచించారు. క్షమాపణ చెప్పాలంటే అసెంబ్లీకి ఆమెను పిలవాలని, స్పీకర్‌ కోరితే ఆమె క్షమాపణ చెబుతుందని రోజా లాయర్ తెలిపారు. అసెంబ్లీకి పిలిచే అవకాశం లేదని, ఆమె క్షమాపణ చెబుతూ స్పీకర్‌కు లేఖ రాయాలని, ఆయన ఆ లేఖను పరిగణలోకి తీసుకుంటారని పీపీ రావు చెప్పారు.

క్షమాపణ సందర్భంగా ఓ న్యాయమూర్తి మాట్లాడుతూ.. రోజా మొదటిసారి ఎమ్మెల్యే అని, అనుభవ లేమితో మాట్లాడి ఉండవచ్చునని, శిశుపాలుడు వంద తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు ఓపిక పట్టాడని, ఆ తర్వాతే శిక్షించాడని, అదే స్ఫూర్తిని ఇక్కడా చూపాలని సూచించారు.

రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ గోపాల గౌడ, జస్టిస్‌ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రోజా తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్‌, ప్రభుత్వం తరఫున పీపీరావు వాదనలు వినిపించారు.

English summary
Supreme Courts Shocks Roja and Chandrababu in suspension issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X