వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే: కేసీఆర్ దూకుడు, దూసుకొస్తున్న హరీశ్, వెనకబడిన కేటీఆర్, కిషన్ సత్తా

తెలంగాణలో శాసనసభ్యుల పనితీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన కేసీఆర్‌కు 96.70 శాతం మార్కులు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ్యుల పనితీరుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేపట్టిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. గజ్వేల్‌ ఎమ్మెల్యే అయిన కేసీఆర్‌కు 96.70 శాతం మార్కులు వచ్చాయి. ఇక మంత్రుల్లో ఈటెల రాజేందర్‌ 89.90 శాతం రెండో స్థానంలో ఉండగా, హరీశ్‌రావు 82.30 శాతం, కేటీఆర్‌ 60.40 శాతం మార్కులు పొంది ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

మొత్తం 119 నియోజకవర్గాల్లో జనవరిలో మొదటి దఫా సర్వే (ఎస్‌1)ను నిర్వహించారు. తాజాగా ఈ నెలారంభంలో రెండో దఫా సర్వే (ఎస్‌2)ను జరిపారు. సర్వే ఫలితాలను గురువారం టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారు.

కాగా, సర్వేలో కొంత పరిస్థితిని మెరుగుపర్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నేత జానారెడ్డికి 63.20 శాతం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 53.70 శాతం మార్కులు రాగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు 43 శాతం, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డికి 84.70 మార్కులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 49.80 మార్కులు పొందారు. మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బర్‌ 57.10 మార్కులను, శాసనసభాపతి మధుసూదనాచారి 50.20 శాతం మార్కులను సాధించారు.

మంత్రుల్లో పద్మారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తొలి మూడు స్థానాలు దక్కించుకోగా జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డి, చందూలాల్‌లు చివరి స్థానాల్లో నిలిచారు. ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యకు రాష్ట్రంలో అతి తక్కువగా 24.40 శాతం మార్కులు వచ్చాయి.

టీఆర్ఎస్ పార్టీకి 106 సీట్లు

టీఆర్ఎస్ పార్టీకి 106 సీట్లు

గురువారం తెలంగాణభవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఒక ప్రైవేటు సంస్థ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చేసిన సర్వే వివరాలను ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చారు. నియోజకవర్గాలవారీగా పార్టీ ఎలా పుంజుకున్నదో సర్వే వివరాల్లో ఉన్నది. సర్వే వివరాలను బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రవ్యాప్తంగా 101 నుంచి 106 స్థానాల వరకు టీఆర్‌ఎస్‌కు రావడం ఖాయంగా కనిపిస్తున్నది. పార్టీ ఊహించనివిధంగా ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో కూడా పుంజుకున్నది.

కేసీఆర్ దూకుడు

కేసీఆర్ దూకుడు

గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. గజ్వేల్‌లో టీఆర్‌ఎస్‌కు 92.60 శాతం మంది ప్రజలు ఓట్లేస్తామని స్పష్టం చేశారు. అదే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనకు 96.70 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఇదో రికార్డుగా చెప్పవచ్చు.

దూసుకొస్తున్న హరీశ్ రావు

దూసుకొస్తున్న హరీశ్ రావు

మెదక్ జిల్లాలోనే ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌కు 82.30 శాతం మంది ఓట్లేస్తామని చెప్పారు. పనితీరులో టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాతి స్థానంలో హరీశ్ రావు ఉండటం గమనార్హం. కాగా, నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది స్థానాలు కూడా టీఆర్‌ఎస్ ఖాతాలోకి వెళ్ళనున్నాయి. ఖమ్మంలో పది స్థానాలుంటే టీఆర్‌ఎస్ పార్టీకి తొమ్మిది స్థానాలు, కాంగ్రెస్‌కు ఒక స్థానం వచ్చే అవకాశాలున్నట్లు సర్వే వెల్లడించింది.

జానారెడ్డి గల్లంతు..

జానారెడ్డి గల్లంతు..

వరంగల్‌లో పదకొండు స్థానాల్లో, రంగారెడ్డిలో 14 స్థానాలకుగాను 13 స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని తేల్చిచెప్పింది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. అందులో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి లేకపోవడం గమనార్హం.

వెనకబడిన కేటీఆర్

వెనకబడిన కేటీఆర్

తాజాగా నిర్వహించిన సర్వేలో సీఎం తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ కొంత వెనకబడినట్లు కనిపించారు. కేసీఆర్ తర్వాతి స్థానాల్లో ఈటెల రాజేందర్‌ 89.90 శాతం రెండో స్థానంలో ఉండగా, హరీశ్‌రావు 82.30 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. 60.40 శాతం మార్కులు పొంది వారి తర్వాతి స్థానంలో కేటీఆర్‌ తర్వాతి స్థానాల్లో ఉండటం గమనార్హం.

సత్తా సాటిన కిషన్ రెడ్డి

సత్తా సాటిన కిషన్ రెడ్డి

కాగా, ఈ సర్వేలో కొంత పరిస్థితిని మెరుగుపర్చుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నేత జానారెడ్డికి 63.20 శాతం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 53.70 శాతం మార్కులు రాగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు 43 శాతం మార్కులు వచ్చాయి. అయితే, బీజేపీ సీనియర్ నేత, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డికి 84.70 మార్కులు తెచ్చుకుని సత్తాచాటారు.

రేవంత్ రెడ్డి అంతంత మాత్రమే..

రేవంత్ రెడ్డి అంతంత మాత్రమే..

కాగా, . తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి 49.80 మార్కులు పొందారు. మజ్లిస్‌ శాసనసభాపక్ష నేత అక్బర్‌ 57.10 మార్కులను, శాసనసభాపతి మధుసూదనాచారి 50.20 శాతం మార్కులను సాధించారు. మంత్రుల్లో పద్మారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తొలి మూడు స్థానాలు దక్కించుకోగా జోగు రామన్న, పట్నం మహేందర్‌రెడ్డి, చందూలాల్‌లు చివరి స్థానాల్లో నిలిచారు. ఎల్‌.బి.నగర్‌ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్యకు రాష్ట్రంలో అతి తక్కువగా 24.40 శాతం మార్కులు వచ్చాయి.

English summary
TS ministers, including K.T. Rama Rao, have fared poorly in a survey ordered by TRS chief and Chief Minister K. Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X