వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు సలహా: టిడిపి పుట్టినప్పుడు చంద్రబాబు ఎక్కడ?

‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించాలని తాను చెబితేనే నాడు ఎన్టీఆర్ ‘టిడిపి’ని స్థాపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ అమరావతి‌: 'తెలుగుదేశం పార్టీ'ని స్థాపించాలని తాను చెబితేనే నాడు ఎన్టీఆర్ 'టిడిపి'ని స్థాపించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వ్యవస్థను బాగు చేయాలంటే తన ఒకడి వల్లే సాధ్యం కాదని భావించి తన మామ ఎన్టీఆర్‌ను పార్టీ స్థాపించాలని కోరినందుకే ఆయన ముందుకు వచ్చారని మూడు రోజుల క్రితం టీడీపీ 37వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇవి. నాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సినీ నటుడు ఎన్టీఆర్ వెంట ఉన్న వారిలో మాత్రం ప్రస్తుత పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం లేరు.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. కానీ ఈనాడు ఏపీలో చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేశ్‌ను క్యాబినెట్‌లో చేర్చుకోనున్నారు. ఆదివారం జరిగే మంత్రివర్గ విస్తరణలో లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వారసుడిగా ఏపీ సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం.. తర్వాతీ పరిణామాలపై ఒక పరిశీలన..

37 ఏళ్ల క్రితం ఆవిర్భావం

37 ఏళ్ల క్రితం ఆవిర్భావం

‘1982 మార్చి 29వ తేదీ'కి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ మాటకు వస్తే జాతీయ రాజకీయాల గతినే మార్చివేసిన రోజది. కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఆ రోజుల్లో ‘తెలుగు ఆత్మగౌరవం' పేరిట ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ'ని స్థాపించారు. స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర లిఖించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏపీలో సాగుతూ వచ్చిన ఏకపార్టీ పాలనకు చరమగీతం పాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

నాటి కాంగ్రెస్ మంత్రిగా బాబు ఇలా

నాటి కాంగ్రెస్ మంత్రిగా బాబు ఇలా

కానీ టీడీపీ స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన్ను అవహేళన చేశారు. రంగులు పూసుకున్న వాళ్లకు ఓట్లేస్తారా? వెటకారం చేశారు. పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తే తన మామపై పోటీ చేసేందుకైనా సిద్ధమేనని భీషణ ప్రతిజ్న చేశారు. కానీ 1983లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక మంత్రిగా ఉన్న చంద్రబాబు.. తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం చంద్రగిరిలో తన ప్రత్యర్థిగా టీడీపీలో సామాన్య నేత చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశారు.

వారం తిరక్కుండానే టీడీపీలో

వారం తిరక్కుండానే టీడీపీలో

1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోపే చంద్రబాబు నాడు మాజీ మంత్రిగా.. నందమూరి ఇంటల్లుడి హోదాలో ఎన్టీఆర్ దరి చేరిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును టీడీపీలో చేర్చుకోవడంపై నాటి అధికార పార్టీ నేతలంతా వ్యతిరేకించారు. అయినా పార్టీ అధినేత - ఏపీ సీఎం ఎన్టీఆర్ అభిమతం తెలిసిన నేతలుగా ఆమోదం తెలిపారు. పార్టీలో చేరడమే తరువాయి పట్టు సాధించడానికే మొగ్గు చూపారు.

అమెరికాలో ఎన్టీఆర్.. తెర వెనుక నాదెండ్ల

అమెరికాలో ఎన్టీఆర్.. తెర వెనుక నాదెండ్ల

సరిగ్గా ఏడాది కాలానికే 1984లో గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. ఆయన అక్కడ ఉండగానే తెర వెనుక సాగిన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నాదేండ్ల భాస్కర్ రావు సారథ్యంలో ‘ఫిరాయింపుల' పర్వానికి తెర తీశారు. కానీ కొందరు అధికార టీడీపీ ఎమ్మెల్యేలు పరిస్థితి సంగతి బయట పెట్టారు. వెంటనే చంద్రబాబు తదితరులు అప్రమత్తమయ్యారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎన్టీఆర్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆఘమేఘాల మీద బయలుదేరి వచ్చేశారు.

ప్రమాణం చేయించిన గవర్నర్ రాంలాల్

ప్రమాణం చేయించిన గవర్నర్ రాంలాల్

1984 ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. కానీ ఆ వెంటనే నాదేండ్ల భాస్కర్ రావుతో నాటి రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఉవ్వెత్తున ఎగసి పడింది. ఇటు నాదేండ్ల భాస్కర్‌రావు, అటు ఎన్టీఆర్ తన మద్దతుదారులతో వేర్వేరు క్యాంపులు నెరిపారు. జాతీయ స్థాయిలో విపక్షాల మద్దతు కూడా దండిగానే లభించింది.

రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్

రాష్ట్రపతి ముందు ఎమ్మెల్యేలతో పరేడ్

తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో నాటి రాష్ట్రపతి ముందు ఎన్టీఆర్ పరేడ్ నిర్వహించారు. తదనంతర పరిణామాల్లో గవర్నర్‌గా రాంలాల్‌కు ఉద్వాసన పలికిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఆ స్థానే శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించారు. ఆ తర్వాత సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం జరిగిపోయాయి. కానీ మళ్లీ ప్రజాతీర్పు పొందాలని భావించారు. 1985లో అసెంబ్లీకి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

చంద్రబాబును అందలం ఎక్కించిన ఎన్టీఆర్

చంద్రబాబును అందలం ఎక్కించిన ఎన్టీఆర్

రెండోసారి సీఎంగా ఎన్టీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడ్ని కర్షక్ పరిషత్ సమన్వయ కర్తగా నియమించి వివాదాలు కొని తెచ్చుకున్నారు. మూడోసారి 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు.. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిని కాదని కుప్పం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకుని విజయం సాధించారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు.

పార్వతి సాకుగా బాబు వ్యూహాత్మక రాజకీయం

పార్వతి సాకుగా బాబు వ్యూహాత్మక రాజకీయం

1994లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు... ఇటు నందమూరి కుటుంబాన్ని దగ్గరకు తీశారు. వైస్రాయి క్యాంపు రాజకీయాలు సాగాయి. మెజారిటీ ఎమ్మెల్యేలతోపాటు నందమూరి కుటుంబాన్ని తనవైపుకు తిప్పుకుని తెలుగుదేశం పార్టీని, అధికారాన్ని చంద్రబాబు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని దూరం పెట్టేశారు. 2004లో ఓటమి పాలైన తర్వాత తిరిగి నందమూరి బాలక్రుష్ణను దగ్గరకు తీసుకున్నారు. బాంధవ్యం కలిపారు. తన కొడుకు లోకేశ్‌కు నందమూరి బాలయ్య కూతురు బ్రాహ్మణితో వివాహం చేసుకుని వియ్యం అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను పోలిన ఆయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ నూ ఏకాకిని చేయడంలో విజయవంతమయ్యారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎన్టీఆర్

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఎన్టీఆర్

తనను కాలదన్ని.. తన వారిని దగ్గరకు తీయడం ద్వారా తనను ఏకాకిని చేసిన ఇంటల్లుడు చంద్రబాబుపై టీడీపీ వ్యవస్థాపకుడిగా మాజీ సీఎం ఎన్టీఆర్ నిప్పులు చెరిగారు. వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. 1995లో తన నుంచి పార్టీని, అధికారాన్ని చంద్రబాబు హస్తగతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులో ద్రోహ చింతన ఎలాంటిదో బయటపెట్టారు. తాను పార్టీ స్థాపించినప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి.. తొలిసారి ఎన్నికల్లో అనామకుడి చేతిలో ఓటమి పాలై.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇంటికొస్తే అల్లుడిగా చేరదీశానని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. పార్టీ నాయకులంతా వ్యతిరేకించినా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించానన్నారు. యువకుడని ప్రోత్సహిస్తే.. దశమ గ్రహంగా ద్రోహం తలపెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక ఔరంగజేబు అని కూడా ఎన్టీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు వ్యవహారాలన్నీ ఎన్టీఆరే నాడు బయట పెట్టారు.

ఆధిపత్య రాజకీయాలే

ఆధిపత్య రాజకీయాలే

2004 నుంచి 2013లో తెలంగాణ రాష్ట్రావిర్భావానికి శ్రీకారం చుట్టినప్పటి నుంచి మరోసారి వ్యూహాత్మకంగా ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. తెలంగాణ పట్ల వ్యతిరేకతతో కేవలం 15 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. నాడు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు మొదలు ఈనాటి వరకు ఆధిపత్య రాజకీయాలకు పెద్దపీట వేస్తూ వచ్చిన చంద్రబాబు..అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఆ క్రమంలోనే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా ముందే తన కొడుకు లోకేశ్‌కు తన క్యాబినెట్‌లోనే మంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రిగా పదవీ ప్రమాణానికి ముందు శాసనమండలికి ఎన్నికైన అతి పిన్న వయస్కుడిగా లోకేశ్ చరిత్ర నెలకొల్పారు. ఆదివారం తండ్రి చంద్రబాబు సారథ్యంలోని క్యాబినెట్‌లో లోకేశ్ అడుగు పెడుతుండటం కొసమెరుపు.

English summary
Andhra Pradesh CM Chandrababu cabinet expansion today while all over arrangements are cleared. CM Chandrababu's son Lokesh also to be take oath as minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X