హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయు కోసం బాబు గళం: ఎన్టీఆర్ శుభలేఖ(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడులో శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారంతో టీడీపీ పండుగ ముగియనుంది. గురువారం నాడు మహానాడు వేదికగా పలు తీర్మానాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు అధ్యక్షులను, చంద్రబాబును కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా ప్రకటించనున్నారు.

మహానాడులో తెలంగాణ టీడీపీ నేతలు, చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితి పైన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాజకీయాధికారం కోసం ప్రజల తరఫున నిలబడి అలుపెరుగని పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై ప్రవేశపెట్టిన తీర్మానాల సందర్భంగా జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. తెరాస పార్టీపై నిప్పులు చెరిగారు. తెదేపా కార్యకర్తలు రేస్‌గుర్రాల్లా, బుల్లెట్లలా దూసుకుపోవాలని, మా కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్డార్ జాగ్రత్త అని, ఎలాంటి చర్యలు, ఉద్యమాలకైనా సిద్ధమని అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రజల సమస్యల తరఫున పోరాడే విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు ఈ బాధ్యతను టీడీపీకిఇచ్చారన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెబుతున్న తెరాస, ఈ పరిస్ధితికి కారణమెవరో ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని, విద్య, ఆరోగ్యం, రోడ్ల అభివృద్ధి తన వల్లనే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ లెక్కలు చూస్తే తెలంగాణ అభివృద్ధికి గతంలో చిత్తశుద్ధితో ఎవరు పాల్పడ్డారో తెలుస్తుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రపంచ స్ధాయి ఉన్నత ప్రమాణాలను హైదరాబాద్‌లో ఎవరు ఏర్పాటు చేశారో చర్చకు సిద్ధమని సవాలు విసిరానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

సైబరాబాద్ నగరాన్ని నిర్మించి అభివృద్ధి చేసింది తానేనన్నారు. మన ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగు ప్రజలు కలిసిమెలిసి ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇంరు ప్రాంతాల ప్రజల మధ్య పెళ్లిళ్లు జరిగాయని, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు 56 ఏళ్లపాటు సహజీవనం చేశాయన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని వచ్చే ఎన్నికల్లో అధికారం తమ పార్టీదేనని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో బలహీనవర్గాల ప్రజలకు మాట్లాడే హక్కు కల్పించిన ఘనత టీడీపీకే దక్కుతుందని, 1983 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అణగారిన వర్గాలకు స్వేచ్ఛ లభించిందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

బలహీనవర్గాలకు రాజకీయంగా మాట్లాడే శక్తిని ఇచ్చిన పార్టీ టీడీపీయే అన్నారు. రైతులు, బలహీనవర్గాలు, మహిళల కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా తెరాస ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకు టిడిపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఒక కార్యకర్త పార్టీ నుంచి బయటకు వెళితే, వంద మందిని తయారుచేసుకునే శక్తి తమ పార్టీకి ఉందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన కళాకారులను ఆదుకోవాలని ఆయన పార్టీ క్యాడర్‌ను కోరారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా తెలంగాణ ఉద్యమం జరిగితే, ఆ వర్శిటీ విద్యార్ధులకే అన్యాయం చేయడం తగదన్నారు. ఓయు భూమి విద్యార్థులదే అన్నారు. దానిని పరాధీనం చేస్తే ఊరుకునేది లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో ప్రతిపక్షంగా రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తాను మొండివాడినని, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాట పటిమ సడలలేదన్నారు. అభివృద్ధిలో మనకు ఉన్న విశ్వసనీయత మరే ఇతర పార్టీకి లేదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మహానాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు వివాహ పత్రిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వంటలు ఘుమఘుమలాడాయి.

English summary
The Telugudesam Party Mahanadu has adopted an unanimous resolution to urge the Centre to confer Bharat Ratna, the highest civilian award of the country, on the party founder and former Chief Minister NT Rama Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X