వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టైమివ్వని సానియా మీర్జా: అమితాబ్ వైపు కేసీఆర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే విషయమై కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అమితాబ్ మంచి అవకాశం అని కేసీఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. దీనిపైన చర్చ కూడా సాగుతోందని అంటున్నారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొద్ది నెలల క్రితం ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నియమించారు. అయితే, ఆమె తన బిజీ టోర్నీల వల్ల ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నారు. సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సమయంలో ఆమెకు రూ.1 చెక్కును కేసీఆర్ ఇచ్చారు. సానియా తెలంగాణ కోసం పని చేస్తారని చెప్పారు. అయితే, ఆమె తన బిజీ టోర్నీల వల్ల ఎక్కువగా విదేశాల్లో ఉంటున్నారు. దీంతో ప్రమోషన్లకు కుదరడం లేదు.

2015 మార్చ్ - ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 160 దేశాలను ఆహ్వానించి పార్ట్‌నర్ షిప్ సమ్మిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించాలంటే అమితాబ్ బచ్చన్‌ను సరైన మార్గమని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల అమితాబ్ 'అక్కినేని అవార్డు' తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన సమయంలో కేసీఆర్‌తో అరగంటకు పైగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సమయంలో వారి మధ్య ఆసక్తికర చర్చ సాగింది. తాను అమితాబ్ అభిమానిని అని, ఆయన సినిమాలు అభిమాన్, ముకద్దర్ కా సికిందర్ తాను చూశానని, వాటిని దాదాపు యాభై సార్లు చూసి ఉంటానని చెప్పారు.

అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. తాను గుజరాత్ రాష్ట్రానికి అంబాసిడర్‌గా చేశానని, దానికి ప్రతిఫలం వచ్చిందని, అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సేవలు అవసరమైన తనవంతు చేస్తానని కేసీఆర్‌కు హామీ ఇచ్చారు.

కేసీఆర్, అమితాబ్

కేసీఆర్, అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే విషయమై కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

సానియా మీర్జా

సానియా మీర్జా

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొద్ది నెలల క్రితం ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నియమించారు. అయితే, ఆమె తన బిజీ టోర్నీల వల్ల ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోతున్నారు.

గుజరాత్

గుజరాత్

సానియా బిజీగా ఉండటం, అమితాబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చునని, దానికి గుజరాత్ మంచి ఉదాహరణ అని భావిస్తున్న కేసీఆర్ బిగ్ బీని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

కేసీఆర్

కేసీఆర్

తాను గుజరాత్ రాష్ట్రానికి అంబాసిడర్‌గా చేశానని, దానికి ప్రతిఫలం వచ్చిందని, అలాగే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సేవలు అవసరమైన తనవంతు చేస్తానని కేసీఆర్‌కు అమితాబ్ ఇటీవల వచ్చినప్పుడు హామీ ఇచ్చారు.

సానియా బిజీగా ఉండటం, అమితాబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆకర్షించవచ్చునని, దానికి గుజరాత్ మంచి ఉదాహరణ అని భావిస్తున్న కేసీఆర్ బిగ్ బీని బ్రాండ్ అంబాసిడర్‌గా చేయాలనే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అమితాబ్ వ్యాఖ్యలను బట్టి ఆయన పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇక ఆయన ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు బాగుంటుంది.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మరింత సంతోషమని చెబుతున్నారు.

English summary
Telangana government is seriously considering to rope in Bollywood superstar Amitabh Bachchan as brand ambassador of the state exclusively for the purpose of promoting industries in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X