వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సౌతాఫ్రికా కన్నీటికి నాడు నేడు అదే: ఒత్తిడి లేదంటూ

By Srinivas
|
Google Oneindia TeluguNews

అక్లాండ్: ప్రపంచ కప్‌లో సౌతాఫ్రికాను వరుణుడు వెంటాడుతున్నాడు! మంగళవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓటమికి వరుణుడు కారణమని చెప్పవచ్చు. వర్షం వల్ల సౌతాఫ్రికాకు గతంలోను చేదు అనుభవం ఎదురైంది. 1992 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌తో సెమీస్‌లో వర్షం వల్ల మ్యాచ్ ఓడటం ఇప్పటికీ అభిమానులకు గుర్తుంటుంది.

దక్షిణాఫ్రికా 13 బంతుల్లో 22 పరుగులు చేయవలసిన స్థితిలో వర్షం పడి మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ మొదలవగానే సమీకరం పూర్తిగా మారిపోయింది. ఒక్క బంతిలో 21 పరుగులు చేయాల్సి వచ్చింది. ఇది అందర్నీ విస్మయానికి గురి చేసింది.

నాడు సౌతాఫ్రికాను దురదృష్టం వెంటాడటం పట్ల బాధపడని వారు లేరని చెప్పవచ్చు. ఆ తర్వాత పలు సందర్భాల్లో వర్షం సౌతాఫ్రికాను దెబ్బతీసింది. ఈసారి కూడా వర్షం ఆ జట్టుకు కన్నీటిని మిగిల్చింది. దక్షిణాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతున్న సమయంలో వర్షం పడింది.

వర్షం పడకుంటే సౌతాఫ్రికా 350 నుండి 370 పరుగుల మధ్య చేసేదే! కానీ, వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించడంతో.. 281 పరుగులు చేసింది. డక్ వర్తలూయిస్ ప్రకారం.. కివీస్ 43 ఓవర్లలో 298 పరుగులు చేయాలి. తమ దేశానికే చెందిన... కివీస్ తరఫున ఆడుతున్న ఎలియోట్ చివరకు సిక్స్ కొట్టి సౌతాఫ్రికాను ఓడించాడు.

అయితే, వర్షం పడకుంటే సౌతాఫ్రికా 350 నుండి 370 పరుగులు చేసేలా కనిపించింది. అంత లక్ష్యాన్ని న్యూజిలాండ్ చేదించకపోయి ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎప్పుడూ వర్షమే సఫారీల కొంప ముంచుతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Time slips by South Africa once again

అయితే, ఇందులో సౌతాఫ్రికా స్వయంకృపరాధం కూడా ఉంది. సులువైన క్యాచ్‌లు అందుకోలేక, తేలికైన రనౌట్లు చేయలేక పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రపంచ స్థాయి బౌలర్‌ స్టెయిన్‌ సైతం కివీస్‌ జోరును ఆపలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి పలు తప్పులు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

77 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద గ్రాంట్‌ ఇలియోట్ ఇచ్చిన క్యాచ్‌ను బెహర్డియన్‌, డుమిని ఇద్దరూ కలిసి వదిలేశారు. అసలిది బెహర్డియన్‌ క్యాచ్‌. కానీ, సరిగ్గా బెహర్డియన్‌ అందుకునే సమయానికి డుమిని వచ్చి అతని మీదపడ్డాడు. దీంతో క్యాచ్‌ నేలపాలైంది. 1999 వరల్డ్‌కప్‌లో స్టీవ్‌వా ఇచ్చిన క్యాచ్‌ను హెర్షల్‌ గిబ్స్‌ వదిలేశాడు. ఆ తర్వాత స్టీవ్‌ ఆసీస్‌ను గెలిచింది.

33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్‌ను రనౌట్‌ చేసే సువర్ణావకాశాన్ని డివిల్లీర్స్‌ చేజార్చాడు. ఆండర్సన్‌ చాలా దూరంలో ఉన్నప్పటికీ బంతిని అందుకుని బెయిల్స్‌ పడేయడంలో తొందరపాటు ప్రదర్శించాడు. చేతిలో పడ్డ బంతిని వదిలేసి ఉత్త చేతుల్తో బెయిల్స్‌ పడగొట్టాడు. తర్వాత బంతి పట్టుకున్నా వికెట్‌ను పీకలేకపోయాడు. ఆండర్సన్‌ బతికిపోయి, హాఫ్‌ సెంచరీ చేశాడు.

స్టెయిన్‌ విసిరిన ఇన్నింగ్స్‌ 41వ ఓవర్‌ మూడో బంతిని ఫైన్‌లెగ్‌ దిశగా ఆడిన ఇలియట్‌ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. డీప్‌ ఫైన్‌లెగ్‌ నుంచి దూసుకొచ్చిన రోసో బంతిని నేరుగా కీపర్‌కు అందించాడు. అయితే డికాక్‌ దాన్ని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో 63 పరుగుల వద్ద ఇలియట్‌ను రనౌట్‌ చేసే అవకాశం కోల్పోయింది.

మ్యాచ్‌కు ముందు తమ పైన ఒత్తిడి లేదని డివిల్లియర్స్ చెప్పాడు. కానీ ఒత్తిడి కనిపించింది. న్యూజిలాండ్ 70 పరుగుల వద్ద ఉన్నప్పుడు అండర్సన్‌ను రనౌట్ చేసే అవకాశం డివిల్లియర్స్‌కు వచ్చింది. అండర్సన్ క్రీజుకు చాలా దూరంలో ఉండగా.. డివిల్లియర్స్ చేతికి బంతి వచ్చింది. కానీ డివిల్లియర్స్ బంతిని వదిలేసి చేత్తో కొట్టాడు. దీంతో బెయిల్స్ కిందపడ్డాయి. ఆ తర్వాత కూడా అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు.

English summary
It was Grant Elliot and New Zealand's time in Auckland. Not South Africa's. But the Proteas will leave this tournament wondering when that will ever change. Maybe next time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X