వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌లో కలవరం: హరీష్ రావు బ్యాక్ బెంచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హంగూ ఆర్భాటాలతో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు వెనక బెంచీ అంటూ వచ్చిన వార్తాకథనాలు టిఆర్ఎస్ కార్యకర్తలను కలవరానికి గురి చేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావు వెనుక వరుసలో కూర్చోవటం పార్టీలో చర్చనీయాంశంగా మారిందంటూ శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.

ప్లీనరీ మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు ఆయన గతంలో మాదిరిగా చురుకుగా కనిపించలేదని ఓ ప్రముఖ దినపత్రిక వ్యాఖ్యానించింది. 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పటినుంచి హరీష్ రావు కీలకమైన భూమికనే పోషిస్తూ వస్తున్నారు.

14 ఏళ్లుగా మెదక్‌ జిల్లా సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుస్తున్నారు. శుక్రవారం నాటి టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లలో మంత్రి హరీశ్‌రావుకు భాగస్వామ్యం లేకుండా పోయిందనే ప్రచారం జరిగింది. ప్లీనరీతోపాటు 27న పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కమిటీల్లోనూ హరీశ్‌ రావుకు బాధ్యతలు ఇవ్వలేదని పార్టీ ముఖ్యులు కొందరు అంతర్గత సంభాషణల్లో అంగీకరించారంటూ మీడియా వార్తలు వచ్చాయి.

 TRS plenary: Harish Rao back bench

ప్లీనరీ ఏర్పాట్లన్నీ కేసీఆర్‌ తనయుడు, మంత్రి కెటి రామారావు కనుసన్నల్లోనే జరిగాయి. మంత్రులు ప్లీనరీ వేదిక ఎల్బీ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించినప్పటికీ, హరీశ్‌ రావు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు.

ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల్లో హరీశ్‌ రావు ఫొటోలు పెద్దగా కనిపించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం ప్లీనరీ ప్రారంభానికి ముందే ఎల్బీ స్టేడియంకు చేరుకున్న హరీశ్‌రావు తొలుత వేదికపైకి వెళ్లలేదు. మిగిలిన మంత్రులు అందరూ వేదికపై ముందు వరుసలో కూర్చున్నప్పటికీ, ఆయన మాత్రం చాలాసేపు వేదిక ముందున్న గ్యాలరీలో ప్రతినిధులతో కలిసి కూర్చున్నారు. సీఎం కేసీఆర్‌ వచ్చిన కొద్దిసేపటికి ఆయన వేదికపైకి వచ్చారు.

అయితే మూడో వరుసలో కూర్చున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే చాలా మంది వచ్చి ఆయనను అభినందించారు. కానీ హరీశ్‌ మాత్రం కేసీఆర్‌ వద్దకు రాకపోవటాన్ని పార్టీ ప్రతినిధులు గుర్తించారు. మొత్తం మీద, హరీష్ రావుకు సంబంధించిన వార్తాకథనాలు సంచలనంగానే మారాయి.

English summary
Reports on Harish Rao's minimal participation in Telangana Rastra Samithi (TRS) plenary has become talk of the town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X