వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ క్యాబ్ రేప్: చుట్టూ 3 పోలీసు స్టేషన్లు, గస్తీ వ్యాన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్ చేతిలో అత్యాచారానికి గురైన మహిళకు మెలుకువ వచ్చే సరికి తాను ఎక్కడున్నానో బహుశా తెలిసి ఉండదు. కానీ, ఆమె ఇంటికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే అత్యాచారానికి గురైంది. అత్యాచారం చేసిన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఆమెను ఉత్తర డిల్లీలోని ఇంటి వద్ద రోడ్డుపై వదిలేసి పోయాడు. ఈ సమయంలో ఆమె కారు లైసెన్స్ ప్లేట్‌ చిత్రాన్ని బంధించగలిగింది.

కాగా, ఆమె ఢిల్లీలోని జకీరా వంతెన సమీపంలో అత్యాచారానికి గురైంది. దానికి సమీపంలో మూడు పోలీసు స్టేషన్లు ఉన్నాయి. సంఘటన జరిగిన శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో ఐదు వ్యాన్లు గస్తీ తిరిగాయి. ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్‌కు కొద్ది మీటర్ల దూరంలో ఉన్న ఆ నిర్మానుష్యమైన ప్రదేశాన్ని ఎవరూ తనిఖీ చేయలేదు.

రెండేళ్ల క్రితం ఓ వైద్యవిద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనను తాజా సంఘటన గుర్తు చేసింది. ఆ సంఘటనను నిందితుడు గుర్తు చేస్తూ మహిళను బెదిరించినట్లు సమాచారం. అరిస్తే ఇనుప రాడ్ దూరుస్తానని అతను బాధితురాలిని బెదిరించాడు. పైగా, టాక్సీ డ్రైవర్ టాక్సీ నడపడానికి నకిలీ పత్రాల ద్వారా ఉబేర్ డ్రైవర్ పర్మిట్ తీసుకున్నాడు. అత్యాచారం కేసుల్లోనే శివకుమార్ యాదవ్ రెండు సార్లు 2011, 2013ల్లో అరెస్టయ్యాడు.

Uber Case: 3 Police Stations, Patrol Vans Where Rape Took Place

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.

కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

English summary
The young executive who woke up to find the taxi in which she had dozed off parked in a secluded spot did not know it at the time, but later would realise that she was barely 3 km from home when she was raped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X