వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హృదయ్‌లో ఓరుగల్లు, అమరావతి: శ్రీకృష్ణుడు.. మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుసంపన్న సాంస్కృతిక వారసత్వా్ని పునరుత్తేజితం చేయడానికి, సంరక్షించుకోవడానికి ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకాన్ని (హృదయ్) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ప్రారంభించారు. హృదయ్‌లో తెలంగాణ నుండి వరంగల్‌కు రూ.40.54 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతికి రూ.22.26 కోట్లు కేటాయించారు.

దేశంలో 12 వారసత్వ పట్టణాల అభివృద్ధి, పునరుద్ధరణ కోసం కొత్తగా హృదయ్‌ పేరిట ఒక పథకాన్ని బుధవారం స్థానిక విజ్ఞన్‌ భవన్‌లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేరును ప్రస్తావించకుండా.. ఆర్డినెన్స్‌ల జారీ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు ఇచ్చారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, దేశ ఆర్థిక రంగాన్ని వృద్ధి చేసేందుకే ఆర్డినెన్స్‌లను జారీ చేశామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చర్యలను అపార్థం చేసుకోవద్దన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా దేవుడిచ్చిన బహుమతి మోడీ అని కితాబిచ్చారు.

నాడు శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్‌ నుంచి గుజరాత్‌కు వెళ్లి ద్వారక నిర్మించి రాజ్యపాలన చేశారని, నేడు నరేంద్ర మోడీ గుజరాత్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌ వచ్చి దేశ పాలన చేస్తున్నారని, దేశానికి దేవుడిచ్చిన బహుమతి నరేంద్ర మోడీ అన్నారు.

 Venkaiah Naidu sanctions Rs.500 cr for 12 cities under newly launched Heritage City Development Scheme (HRIDAY)

మోడీ అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పారు. ఇంతకాలం అప్పులు తెస్తూనే ఉన్నామని, దేశ ఆదాయంలో 43.3 శాతం నిధులను అలా తెచ్చిన రుణాలను తిరిగి చెల్లించేందుకే కేటాయించాల్సి వస్తోందన్నారు. నిధులు కావాలంటే పెట్టుబడుల్ని ఆకర్షించాల్సి ఉందని, సంపద సృష్టించాల్సి ఉందని చెప్పారు.

హృదయ్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన వారసత్వ నగరాల పునరుద్ధరణకు నిధుల మంజూరులో వారణాసికి అత్యధికంగా రూ.89.31 కోట్లు కేటాయించారు. శ్రీకృష్ణ జన్మస్థానం మథురకు రూ.40.04 కోట్లు, శ్రీకృష్ణుడు పెరిగిన ద్వారక పట్టణానికి రూ.22.26 కోట్లు కేటాయించారు. మొత్తంగా 12 నగరాలకు రూ.500 కోట్లు కేటాయించారు.

మోదీ.. వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే ఎక్కువ నిధులు కేటాయించారన్న ఆరోపణలపై వెంకయ్య స్పందించారు. జనాభా ఆధారంగానే నిధులను కేటాయించామని చెప్పారు. వారణాసి జనాభా ఎక్కువని, అందకు తగినట్లుగా వారసత్వ కట్టడాల వద్ద సదుపాయాలను పెంపొందించాల్సి ఉంటుందన్నారు. శ్రీకృష్ణుడు జనాభా నియంత్రణ పాటించాడని శివుడేమో పాటించలేదని సరదాగా వ్యాఖ్యానించారు.

English summary
Venkaiah Naidu sanctions Rs.500 cr for 12 cities under newly launched Heritage City Development Scheme (HRIDAY)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X