వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వణికిపోయి, ఏడ్చేసిన దినకరన్: ఢిల్లీ పోలీసుల తిప్పలు

రెండాకుల గుర్తు కోసం రూ.50 కోట్లకు పైగా ఈసీకి లంచం ఇవ్వచూపిన కేసులో అన్నాడీఎంకే నేత టిటివి దినకరన్‌ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: రెండాకుల గుర్తు కోసం రూ.50 కోట్లకు పైగా ఈసీకి లంచం ఇవ్వచూపిన కేసులో అన్నాడీఎంకే నేత టిటివి దినకరన్‌ను పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. నాలుగు రోజుల పాటు విచారించిన పోలీసులు, ఆ తర్వాత అరెస్టు చేశారు.

సుఖేష్‌ని కలిశా: వీడియోతో దినకరన్ మైండ్ బ్లాక్, శశికళకు ఊహించని షాక్సుఖేష్‌ని కలిశా: వీడియోతో దినకరన్ మైండ్ బ్లాక్, శశికళకు ఊహించని షాక్

పోలీసుల విచారణ సమయంలో దినకరన్ ఏడ్చినట్లుగా తెలుస్తోంది. తొలుత మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదని దినకరన్ చెప్పాడు. ఆ తర్వాత రెండు రోజుల విచారణ అనంతరం వీడియోలు ముందు పెట్టడంతో.. తనకు అతను తెలుసునని అంగీకరించాడు.

ఏడ్చాడు.. వణికిపోయాడు

ఏడ్చాడు.. వణికిపోయాడు

అంతేకాదు, విచారణ సమయంలో సుఖేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ పోలీసులు దినకరన్ ఎదుటకు తీసుకు వచ్చారు. ఆ సమయంలో దినకరన్ ఒక్కసారిగా కంటతడి పెట్టాడని తెలుస్తోంది. ఆ సమయంలో దినకరన్ వణికిపోయాడని తెలుస్తోంది.

ప్రశ్న ప్రారంభం కాగానే..

ప్రశ్న ప్రారంభం కాగానే..

ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు అతనిని విచారణ చేయడం ప్రారంభించారో.. తనను మొదటి ప్రశ్న అడిగారో.. అప్పుడే దినకరన్ వణికిపోయాడని తెలుస్తోంది. అతనిని పోలీసులు మంగళవారం నాలుగో రోజు చాణక్యపురి పోలీస్ స్టేషన్లో విచారించారు.

ప్రశ్నల వర్షం

ప్రశ్నల వర్షం

విచారణ సమయంలో ఓ సందర్భంలో సుఖేష్ చంద్రశేఖర్‌ను పోలీసులు దినకరన్ ఎదుటకు తీసుకు వచ్చారు. సుఖేష్‌ను ఎదుట ఉంచి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమయంలో అతని కళ్లలో నీళ్లు తిరిగాయని, ఏడ్చాడని తెలుస్తోంది.

అన్ని కాల్స్ ఎందుకు చేశావ్?

అన్ని కాల్స్ ఎందుకు చేశావ్?

సుఖేష్‌కు అన్ని ఫోన్ కాల్స్ ఎందుకు చేశావని దినకరన్‌ను పోలీసులు నిలదీశారు. 'ఓ వైపు సుఖేష్ నాకు తెలియదని చెబుతున్నావ్.. మరోవైపు, ఆయనకు చాలా కాల్స్ చేశావ్' అని పోలీసులు నిలదీశారు. ఈ మేరకు కాల్ రికార్డులు కూడా ఆయన ముందు ఉంచారు.

నిజం కక్కించేందుకు మూడు రోజులు

నిజం కక్కించేందుకు మూడు రోజులు

విచారణ అధికారులలో ఒకరు మాట్లాడుతూ.. దినకరన్ నుంచి నిజం కక్కించేందుకు మూడు రోజులు పట్టిందని చెప్పారని తెలుస్తోంది. తొలుత అతని నుంచి నిజం రాబట్టడం చాలా కష్టమయిందని చెప్పారు. ఆ తర్వాత పూర్తి ఆధారాలు, రికార్డులను అతను ముందు పెట్టడంతో మొత్తం చెప్పేశాడని చెప్పారు.

English summary
TTV Dinakaran who was arrested in connection with the Election Commission bribery case was adamant at first. However when Sukesh Chandrashekhar the conman was brought before him and the Delhi police hurled proof at him, he broke down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X