వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడుల వ్యూహాల్లో దిట్ట, మోడీ మెచ్చిన ఐపీఎస్: ఎవరీ అజిత్ దోవల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అజిత్ దోవల్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. యుద్ద వ్యూహాల్లో దిట్ట అయిన దోవల్.. ప్రస్తుతం పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో అనేక ఆపరేషన్లలో చాకచక్యంగా నిర్వహించిన దోవల్.. ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అందుకే ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరమే దోవల్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు నరేంద్ర మోడీ.

ప్రస్తుతం దోవల్.. ప్రధానికి జాతీయ భద్రతా సలహాదారుగా కొనసాగుతున్నారు. ఐపీఎస్ అధికారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. భారత ఇంటెలీజెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా కూడా ఆయన పని చేశారు.

1988 పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగరంలోని ఒక ప్రార్థనామందిరంలోని ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు ఆపరేషన్‌ బ్లాక్‌థండర్‌ను ప్రారంభించాయి. అయితే ఉగ్రవాదులు ఎందరు వున్నారో అంతుబట్టడం లేదు.

modi-ajit

ఆ సమయంలో ఐపీఎస్‌ అధికారి అయిన దోవల్.. రిక్షా కార్మికుని వేషంలో లోపలికి వెళ్లి ఉగ్రవాదులకు నచ్చజెప్పి భద్రతాదళాలకు లొంగిబోయేలా చేశాడు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది.

వ్యూహాల్లో దిట్ట

2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే అజిత్‌దోవల్‌ను జాతీయ భద్రతాసలహాదారుగా నియమించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ ఐపీఎస్‌ అధికారి దోవల్‌. కేరళతో పాటు ఈశాన్యరాష్ట్రాల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

మౌనంగా తనపనిని తాను చేసుకొని వెళ్లే దోవల్‌ వ్యూహాల్లో దిట్ట. పాక్‌ను ఏకాకి చేసేందుకు ఆయన అంతర్జాతీయంగా అన్నియత్నాలు ప్రారంభించారు. గతంలో పాక్‌లోని భారత దౌత్యకార్యాలయంలో సిబ్బందిగా ఏడు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు.

ఆయన పాత్ర ఎప్పుడూ కీలకమే

సంక్లిష్ట సమయాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశానికి కీలకంగా మారుతున్నాయి. పఠాన్‌కోట్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్న సమయంలో వారిని ఏరివేసే యత్నాల్లో వున్న భద్రతాదళాలను సమన్వయపరిచాడు.

తాజాగా యూరీ ఉగ్రదాడి ఘటన అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదశిబిరాలపై భారతదళాల మెరుపుదాడులకు వ్యూహం పన్నినవారిలో ఆయన కూడా ఒకరు. భారత విదేశాంగ విధానంలో కీలకమార్పులకు నాందిపలుకుతున్న దోవల్‌ను.. పలువురు ఇండియన్‌ జేమ్స్‌బాండ్‌ అంటూ ప్రశంసిస్తున్నారు.

1971-99 మధ్య భారత్‌లో జరిగిన 15 విమాన హైజాకింగ్‌ యత్నాలను ఆయన ఆధ్వర్యంలోని భద్రతాదళాలు అడ్డుకొని కుట్రదారుల యత్నాలను భగ్నం చేశాయి. ఇటీవల అమెరికా భద్రతా సలహాదారు కూడా అజిత్ దోవల్‌కు ఫోన్ చేసి తమ మద్దతును తెలియజేసింది. ఉగ్రపోరులో భారత్ వెంటే ఉంటామని అమెరికా భద్రతా సలహాదారు సూసన్ రైస్.. ఆయనకు ఫోన్లో వివరించారు.

English summary
A story about Indian security adviser Ajit Doval.A story about Indian security adviser Ajit Doval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X