వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూరీ సహా టాలీవుడ్‌కు చుక్కలు: ఎవరీ అకున్ సబర్వాల్?

అకున్ సబర్వాల్.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు. డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్టు, పలువురు సిని తారల పేర్లు బయటకు వచ్చిన సమయంలో అకున్ సెలవులపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అకున్ సబర్వాల్.. ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న పేరు. డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్టు, పలువురు సిని తారల పేర్లు బయటకు వచ్చిన సమయంలో అకున్ సెలవులపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఏది నిజం: ఊహించిన దానికన్నా.. ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పిన పూరీ?ఏది నిజం: ఊహించిన దానికన్నా.. ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్పిన పూరీ?

కానీ డ్రగ్స్ కేసును నీరుగార్చేందుకు ఆయన సెలవులపై వెళ్లేలా ప్రభుత్వం చేసిందని విమర్శలు వచ్చాయి. అనంతరం ఆయన తన సెలవులను రద్దు చేసుకున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో సిని తారలను ఆయన పర్యవేక్షణలో విచారిస్తున్నారు.

విచారణకు రాకుంటే.. హెచ్చరిక

విచారణకు రాకుంటే.. హెచ్చరిక

అకున్ సబర్వాల్.. ఇప్పుడు డ్రగ్స్ వాడుతున్న సినీ ప్రముఖులకు ఆయన అంటే హడల్. డ్రగ్స్ వ్యవహారంలో పేర్లు ఉన్న వారందరినీ సిట్ కార్యాలయానికి రప్పించి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. విచారణకు హాజరు కానివారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Recommended Video

Hyderabad Drugs Case : Puri Jagannadh interrogated for almost 10 hours by SIT
ఎవరీ అకున్ సబర్వాల్?

ఎవరీ అకున్ సబర్వాల్?

అకున్ సబర్వాల్ పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన వారు. తండ్రి ఆర్మీ ఆఫీసర్. కాబట్టి చిన్నప్పటి నుంచే దేశభక్తి ఏర్పడింది. వృత్తిరీత్య డెంటిస్ట్. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాశారు. 2001లో ఆయన సెలక్ట్ అయ్యారు. అకున్ సతీమణి స్మితా సబర్వాల్ సీఎం పేషీలో కీలక స్థానంలో ఉన్నారు. అసోం క్యాడర్‌కు ఎంపికైన అకున్.. అక్కడ తీవ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పనిచేశారు.

అకున్ సబర్వాల్ హయాంలో..

అకున్ సబర్వాల్ హయాంలో..

ఆ తర్వాత ఉమ్మడి ఏపీకి వచ్చారు. అనంతపురం ఎస్పీగా ఫ్యాక్షనిస్టులపై ఉక్కుపాదం మోపారు. అనంతరం వరంగల్ ఓఎస్డీగా, ఆ తర్వాత విశాఖ ఎస్పీగా పని చేశారు. ఆయన హయాంలో 28సార్లు పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా వచ్చారు. అకున్ పని తీరు బాగా ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయనకు ఎక్సైజ్ శాఖ బాధ్యతలను అప్పగించారు.

ప్రముఖులను కూడా వదల్లేదు

ప్రముఖులను కూడా వదల్లేదు

తొలుత గుడుంబాపై, ఇప్పుడు డ్రగ్స్ పైన అకున్ సబర్వాల్ ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ ఏజెంట్స్‌కు చుక్కలు చూపిస్తున్నారు. సినీ పెద్దలను కూడా వదల్లేదు. ప్రముఖ సినిమా తారలు పూరీ, రవితేజ, చార్మి వంటి వారికి కూడా చుక్కలు చూపిస్తున్నారు.

English summary
Drug investigation officer Akun Sabharwal from Punjab's Patiala. His father was army officer. He worked in Warangal, Vishaka and Assam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X