వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదాతోనే భవిష్యత్తు: గళమెత్తిన జగన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రె పార్టీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం గుంటూరు నల్లపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిరవధిక దీక్షను జగన్ చేపట్టారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా గుంటూరు వచ్చిన జగన్ సభికులనుద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు. ఏపి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలను మోసం, దగా చేస్తూ పాలన కొనసాగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదా అడగడనే బెంగతో ఐదుగురు మృతి చెందారన్నారు. వారందరికీ పేరుపేరునా నివాళులర్పించిన జగన్.. పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట మోకరిల్లి ప్రత్యేకహోదా ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేకహోదా సాధిస్తే కేంద్రం నుంచి 90 శాతం గ్రాంట్ లభిస్తుందని, తద్వారా 100 శాతం ఆదాయపన్ను మినహాయింపు, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చుల మినహాయింపు లభిస్తాయన్నారు. దీని వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. విద్యుత్ సగం ధరకే 20 ఏళ్ల పాటు లభిస్తుందన్నారు.

హోదా రాని పక్షంలో 25 నుంచి 55 శాతం లోపు మాత్రమే గ్రాంటు లభిస్తుందని, అయితే పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా వేరే ప్రాంతానికి తరలిపోతాయన్నారు. ప్రత్యేకహోదా వస్తే 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నందున పరిశ్రమల స్థాపనకు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు తమ దీక్ష కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రె పార్టీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి స్పష్టం చేశారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

బుధవారం గుంటూరు నల్లపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిరవధిక దీక్షను జగన్ చేపట్టారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నేరుగా గుంటూరు వచ్చిన జగన్ సభికులనుద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదన్నారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ఏపి సిఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలను మోసం, దగా చేస్తూ పాలన కొనసాగించడం హేయమైన చర్యగా అభివర్ణించారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకహోదా అడగడనే బెంగతో ఐదుగురు మృతి చెందారన్నారు. వారందరికీ పేరుపేరునా నివాళులర్పించిన జగన్.. పిల్లల తల్లిదండ్రులు కూడా చనిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట మోకరిల్లి ప్రత్యేకహోదా ఊసే లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

వైయస్ జగన్ దీక్ష

వైయస్ జగన్ దీక్ష

ప్రత్యేకహోదా సాధిస్తే కేంద్రం నుంచి 90 శాతం గ్రాంట్ లభిస్తుందని, తద్వారా 100 శాతం ఆదాయపన్ను మినహాయింపు, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చుల మినహాయింపు లభిస్తాయన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడం వలన 30 వేల కోట్ల పెట్టుబడులు, 130 శాతం అధికంగా పరిశ్రమలు, 490 శాతం అధికంగా ఉపాధి లభించిందన్నారు. అయితే చంద్రబాబు ప్రత్యేకహోదా సంజీవనా అని ప్రశ్నించడం చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందన్నారు.

కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించేందుకు చంద్రబాబు కుమ్మక్కై సోనియాతో తనపై కేసులు పెట్టించారని, రాజకీయంగా అణగదొక్కేందుకు చీకట్లో చిదంబరాన్ని కలిశారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రమంత్రివర్గం నుంచి తెలుగుదేశం మంత్రులను ఉపసంహరించి చంద్రబాబు అల్టిమేటం జారీచేస్తే 24 గంటల్లో ప్రత్యేకహోదా సాధ్యమవుతుందన్నారు.

‘మనమంతా కలిసి పోరాడుదాం.. సిఎం మనసు మారుతుంది. కేంద్రానికి అల్టిమేటం ఇస్తారు.అది దిగి వస్తుంది' అని జగన్ అన్నారు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా కోసం ప్రజలను దగా చేయకుండా కేంద్రానికి అల్టిమేటం ఇవ్వని పక్షంలో ఈ పాలనకు చరమగీతం పాడి బంగాళాఖాతంలో కలిపే రోజు త్వరలోనే వస్తుందని జగన్ పేర్కొన్నారు.

English summary
YSR Congress President YS Jagan Mohan Reddy today began his indefinite fast at Nallapadu village here in support of 'Special Status' demand for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X