By: Oneindia Telugu Video Team
Published : March 17, 2017, 12:17

ధోని కి తప్పిన పెను ప్రమాదం

Subscribe to Oneindia Telugu

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా ధోని విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్‌లో భాగంగా బెంగాల్ జట్టుతో జార్ఖండ్ తలపడనుంది. ఈ క్రమంలో ధోని ఈ మ్యాచ్ ఆడేందుకు ఢిల్లీకి వెళ్లాడు. ఢిల్లీలోని ద్వారకలోని వెల్‌కం హోటల్‌లో జట్టు సభ్యులందరూ బస చేశారు. అయితే శుక్రవారం ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో హోటల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్‌లో బస చేసిన జార్ఖండ్ జట్టు సభ్యులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా