By: Oneindia Telugu Video Team
Published : February 10, 2017, 05:56

ఈరోజు టాప్ 5 న్యూస్

Subscribe to Oneindia Telugu

1.మూడురోజుల పాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు.
2.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్వరూపం ప్రదర్శించాడు. గురువారం తొలి రోజు ఆటలో సెంచరీ బాదిన కోహ్లి.. శుక్రవారం రెండో రోజు ఆటలో కూడా దూకుడుగా ఆడి మరో శతకం నమోదు చేశాడు. ఓవరాల్ గా 239 బంతుల్లో 24 ఫోర్లతో డబుల్ సెంచరీతో కోహ్లి అదరగొట్టాడు.
3. సొంత రాష్ట్రంలో పనిచేస్తామని అభ్యర్థించే ప్రభుత్వ ఉద్యోగులకు అందుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల కమిటీలతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.
4.బంగారం ధర భారీగా పతనమైంది. ఏకంగా మూడు వారాల కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం దేశ రాజధానిలో రూ.400 తగ్గిన 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.29,500 పలికింది.
5.అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని, ఆమె ఎన్నికను పరిగణలోకి తీసుకోరాదని కోరుతూ ఆ పార్టీ ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొదటి నుంచి శశికళ శిబిరంలో ఉన్న మధుసూదనన్ రాజీ పేరుతో పన్నీర్ ఇంటికి వెళ్లి చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా