వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా:సీబీఐ మాజీ జెడి వీవీ లక్ష్మీనారాయణ;‘పీపుల్స్‌ మేనిఫెస్టో’ ఆవిష్కరణ

|
Google Oneindia TeluguNews

తిరుపతి:తాను త్వరలోనే నిర్దిష్ట ప్రణాళికతో రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్లు సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటించారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌ సాధనే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాల ద్వారానే ప్రజలకు విస్తృతంగా సేవ చేయడానికి సాధ్యమవుతుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రైతులు, గ్రామాల సమస్యలపై లక్ష్మీనారాయణ చేపట్టిన రాష్ట్రంలో 13 జిల్లాల పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం తిరుపతిలో ఆయన 'పీపుల్స్‌ మేనిఫెస్టో' వెబ్‌పోర్టల్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించిన తన ఆలోచనలు, విజయం గురించి ఆలోచనలు మీడియాతో పంచుకొన్నారు.

''ఎన్నికల్లో 65 శాతంమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు...అందులో సగం మంది డబ్బు తీసుకోకుండానే ఓటు వేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించాలి. అలాగే ఓటింగ్‌లో పాల్గొనని 35 శాతంలో సగం మందినైనా ఎన్నికలపై చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది...ఈ రెండు పక్షాలను కలిపితే 50 శాతంపైగానే ఉంటారు. వీరి మద్దతును కూడగట్టుకొంటే రాజకీయాల్లో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు...తేలిగ్గానే మెజారిటీని సాధించవచ్చు''...అని లక్ష్మీనారాయణ సూత్రీకరించారు.

Former CBI JD VV Lakshminarayana to enter politics very soon

అందరూ అభిప్రాయపడుతున్నట్లు రాజకీయాలంటే మనీ పాలిటిక్సే కాదని, డబ్బు ఇవ్వకుండానే రాజకీయాలు చేయవచ్చని లక్ష్మీనారాయణ అన్నారు. రాజకీయాలకు సంబంధించి తనలాంటి ఆలోచనా విధానాలు ఉన్నవారు కలిస్తే, వారితో కలసి ప్రయాణం చేసేందుకు సిద్ధమని ఆయన వెల్లడించారు. జిల్లాల పర్యటనలో తాను గుర్తించిన సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఒక నివేదికను తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేయనున్నట్లు
లక్ష్మీనారాయణ చెప్పారు.

దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కావాలంటే స్వామి నాథన్‌ సిఫార్సులను అమలు చేసి, గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుల ఆత్మహత్యలు, ఇక్కట్లు, వలసలు నివారించవచ్చని, మరి స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో తెలియడం లేదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే రైతులకు రుణమాఫీ, సబ్సిడీల అవసరం ఉండదన్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలు రావాలని, ధరల స్థిరీకరణ జరగాలన్నారు. గ్రామానికి ఒక అధికారి ఉండాలని, ప్రతి జిల్లాకు ప్రత్యేక వ్యవసాయ పాలసీ ఉండాలన్నారు. గ్రామీణ సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్‌ మ్యానిఫెస్టోను రూపొందించామన్నారు. ప్రతి గ్రామానికి పీపుల్స్‌ మ్యానిఫెస్టో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి దిశగా సాగుతుందని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.

English summary
Former CBI Joint Director VV Lakshminarayana on Saturday announced his entry into politics and declared that he is ready to work with any likeminded Party which endorses his policies for development with a thrust over agriculture and rural development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X