• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమస్యల సుడిగుండం సౌరాష్ట్ర.. పాటిదార్ల కోసం పోటాపోటీ

By Swetha Basvababu
|

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతం వ్యవసాయ రంగ ప్రగతి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. 2002 నుంచి 2012 వరకు 10 శాతానికి పైగా ప్రగతి తగ్గిపోయింది. సౌరాష్ట్ర ప్రాంతంలోని భరత్ గాఢియా ప్అనే రైతు మరో మూడు నెలల్లో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌కు 10 క్వింటాళ్ల వేరుశనగ తీసుకురానున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకారం క్వింటాల్‌కు రూ. 4500 చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. వేరు శనగతోపాటు పత్తి రైతులు కనీస మద్దతు ధర లభించక పోవడంతో ఆందోళనకు చెందుతున్నారు.

 తడిసి మోపెడవుతున్న ఎరువుల ఖర్చు ప్లస్ వ్యవసాయ కూలీ

తడిసి మోపెడవుతున్న ఎరువుల ఖర్చు ప్లస్ వ్యవసాయ కూలీ

ఈ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు ప్రతిరోజూ 25 - 30 మంది రైతుల నుంచి వేరు శనగ సేకరిస్తున్నారు. మిగతా రైతులు గాఢియా మార్కెట్‌లో వ్యాపారులు చేసిన సిఫారసుల మేరకు, చెప్పిన డిమాండ్ల మేరకు కారు చౌకకు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. బహిరంగ మార్కెట్‌లో రూ.3,250లకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్నారు. దీనివల్ల జీవనం సాగించడానికి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర ఖర్చులు మాత్రమే వస్తాయి. ‘గుజరాత్‌లో నిత్యం పఠిస్తున్న అభివ్రుద్ధి అంతా పిచ్చిగా మారింది. కానీ వ్యవసాయ ప్రగతికి గణాంకాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. రసాయన ఎరువుల ఖర్చులు, వ్యవసాయ కార్మికుల వేతనాలు రైతులకు తడిసి మోపెడై.. వ్యవసాయ మార్కెట్‌లో తగ్గుతున్న రైతులకు మోయలేని భారంగా మారాయి.

 కనీస మద్దతు ధర అమలు చేయని వ్యాపారులతో రైతుల తంటాలు

కనీస మద్దతు ధర అమలు చేయని వ్యాపారులతో రైతుల తంటాలు

రాజ్‌కోట్ జిల్లా పిథాడియా గ్రామానికి చెందిన పాటిదార్ రైతు ఒకరు మాట్లాడుతూ పంటల సాగు వల్ల వచ్చే ఆదాయం వల్ల తమ కుటుంబాల జీవనానికి మాత్రమే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వచ్చే ఏడాది పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం కష్ట పడాల్సి వస్తున్నదని వాపోయారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం చెప్పే కబుర్లు, ఆచరణకు హస్తిమశకాంతరంగా మారిందని చెప్పారు. ‘అభివ్రుద్ధి పిచ్చిగా మారింది' అన్న ప్రచారాన్ని పాటిదార్ రైతు గుర్తు చేశారు. వేరు శనగ రైతులు మాత్రమే కాదు.. పత్తి ధర కూడా శరవేగంగా పడిపోతున్నది. వరుసగా రెండేళ్లుగా వర్షాలు కురవక పోవడంతో ఏం చేయాలో తెలియక రైతుల్లో ఆందోళనకు గురవుతున్నారు. నిరాశ చెందుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. 2002 - 03లో క్వింటాల్ పత్తి ధర రూ.5000 పలికితే 2013 - 14లో అది కేవలం రూ.2,200 మాత్రమే పలుకుతున్నది. నాటి నుంచి కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) సగటున రూ.4000 మాత్రమే అమలవుతున్నది. రైతుల్లో ఆగ్రహాన్ని గుర్తించిన గుజరాత్ సర్కార్.. ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటాల్‌పై రూ.4,500 అమలు చేయాలని ప్రకటించింది.

రైతుల్లో ఇలా పెరుగుతున్న అసంత్రుప్తి

రైతుల్లో ఇలా పెరుగుతున్న అసంత్రుప్తి

అదే సమయంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందుల ధరలు, వ్యవసాయ కార్మికుల వేతనాలు రెట్టింపయ్యాయి. రోజువారీ వ్యవసాయ కార్మికుడి వేతనం రూ.150 నుంచి ప్రస్తుతం రూ.300 పలుకుతుంది. అదీ వ్యవసాయ కార్మికుడు దొరకడం కూడా కష్టసాధ్యంగా మారింది. ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2014 ఎన్నికల్లో పత్తి తెల్ల బంగారంగా మారుస్తానని ప్రత్తికి ప్రతి 20 కిలోలకు రూ.1500, వేరు శనగకు రూ.1200 ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం' అని భికుభాయి గాథీయా అనే రైతు చెప్పారు. కానీ నాటి నుంచి ఇప్పటి వరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల రైతుల్లో వ్యతిరేకతను తెలియజేస్తుంది.

 పరిశ్రమల కాలుష్యంతో రైతులకు తప్పని ఇబ్బందులు

పరిశ్రమల కాలుష్యంతో రైతులకు తప్పని ఇబ్బందులు

మార్కెట్‌లో ధరలు తగ్గిపోవడంతోపాటు సకాలంలో విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటల బీమా సకాలంలో బట్వాడా కాక, అవసరానికి సరిపడా సాగునీటి వసతులు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పరిశ్రమలు వదిలిన కాలుష్య కారకాలతో రైతులు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదు. రైతుల సమస్యల పరిష్కారం పట్ల సర్కార్ ఉదాశీనత వ్యవసాయ రంగంలో సంక్షోభాన్ని మరింత పెంచిందన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితమే అధికారిక గణాంకాల ప్రకారమే గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలో వ్యవసాయ స్థూల రంగ ప్రగతి తగ్గుముఖం పడుతోంది.

 ఓటేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన పటేళ్లు

ఓటేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన పటేళ్లు

కిశోర్ పటేల్ అనే రైతు మాట్లాడుతూ ఈ ఏడాది 2.5 ఎకరాల్లో బీటీ కాటన్ విత్తనాలు సాగు చేయడంతో సగం భూమి ‘పింక్ బాల్ వార్మ్'తో దెబ్బ తిన్నది. బోరు బావులు ఎండిపోతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ రైతులను ఆదుకోలేకపోయింది. గత ఏడాది కూడా ప్రభుత్వం అమలుచేస్తున్న పంటల బీమాకు సంబంధించి అణా పైస కూడా అందుకోలేదని తెలిపారు. ఆయన సోదరుడు జనక్ పటేల్ మాట్లాడుతూ ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేయబోనని తేల్చేశాడు. జిత్పూర్ అసెంబ్లీ స్థానం పరిధిలోకి పిథాడియా వస్తుంది. 2002 నుంచి ఈ అసెంబ్లీ స్థానం నుంచి (2012, 2013ల్లో మినహా) బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రస్తుతం సౌరాష్ట్ర ప్రాంతంలో బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 48 అసెంబ్లీ స్థానాల పరిధిలో కష్టకాలం ఎదురవుతున్నది. దీనికి కారణం సౌరాష్ట్ర పరిధిలో పటేళ్లు ఉండటమే. రెండేళ్లుగా పాటిదార్లు ఓబీసీ కోటాలో రిజర్వేషన్ కోసం ఆందోళన చేసినందుకు ప్రభుత్వ అణచివేతకు గురవుతున్నారు. గుజరాత్ అసెంబ్లీలోని 182 స్థానాల్లో 48 సౌరాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి.

 కారుచౌకగా పత్తి పంట విక్రయిస్తున్న రైతులు

కారుచౌకగా పత్తి పంట విక్రయిస్తున్న రైతులు

‘నేను ఓటింగ్ వేయడం ప్రారంబించినప్పటి నుంచి బీజేపీకే ఓటేశారు. కానీ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరైన రీతిలో లేవు' అని అశోక్ గఢాలియా అనే రైతు, బీజేపీ కార్యకర్త చెప్పారు. మోర్బి జిల్లా మహేంద్ర నగర్ గ్రామం కూడా బీజేపీకి కంచుకోటగా ఉన్నది. ఇక్కడా అదే పరిస్థితి నెలకొంది. ఈ నియోజకవర్గ పరిధిలో రాంజీ మోహన్జీ 50 మంది రైతుల్లో సాగు చేసిన బీటీ కాటన్ వల్ల పంట పొలం దెబ్బ తిన్నదని తెలిపాడు. ఇన్‌పుట్ వ్యయం ప్రభుత్వం మంజూరు చేసినా స్వతంత్రంగా పనిచేసే వ్యవసాయ కమిషన్ లేకపోవడం వల్ల ఎగుమతులు, దిగుమతులకు సరిపడా ధర లభించక ఇబ్బందుల పాలవుతున్నామని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 700 కిలోల పంట పండటానికి బదులు 400 కిలోలు మాత్రమే పండుతున్నది. ఇలా గత దశాబ్ద కాలంలో పంట సాగు పడిపోతున్న తీరు గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రలో స్పష్టంగానే కనిపిస్తున్నది. సరిపడా సాగునీటి వసతులు లేక.. పండిన పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఖేదుత్ సమాజ్ కార్యదర్శి సాగర్ రాబారీ ఆందోళన వ్యక్తం చేశారు.

 హిందుత్వ కంచుకోటలో పటేళ్ల ఆగ్రహం ఇలా

హిందుత్వ కంచుకోటలో పటేళ్ల ఆగ్రహం ఇలా

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సౌరాష్ట్ర ప్రాంతం ఇచ్చే తీర్పుపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆరు జిల్లాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించిన ఈ ప్రాంతంలోనే అత్యధిక శాతం మంది పాటీదార్లు నివసిస్తున్నారు. మరోవైపు ఇది హిందుత్వవాదానికి కంచుకోట కూడా కావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ భక్తులు, ఆయనను ద్వేషించే వారూ అధికసంఖ్యలోనే ఉండడంతో ఆసక్తి నెలకొంది. మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నాయి. ‘ప్రధాని మోదీ పని అయిపోయింది, ఆయన స్వస్థలం వాద్‌నగర్‌కు వెళ్లి పింఛను తీసుకోవాలి' అని యువ పాటీదార్‌ ఓటర్ సంజీవ్‌ పటేల్‌ ఆగ్రహంతో చెప్పాడు. సలీంబాయి బేకరీవాలా అనే 30 ఏళ్ల కాంగ్రెస్‌ కార్యకర్తది ఇదే అభిప్రాయం. రాజ్‌కోట్‌ వెస్ట్‌లో సీఎం విజయ్‌ రూపానీని తమ అభ్యర్థి ఇంద్రనీల్‌ రాజగురు ఓడించనున్నారని అన్నారు. ప్రజలు బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారని, చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదని విమర్శించారు.

 విడిగా కేశుభాయి పటేల్ పోటీతో బీజేపీ ఇలా గెలుపు

విడిగా కేశుభాయి పటేల్ పోటీతో బీజేపీ ఇలా గెలుపు

ఈ విమర్శలను బీజేపీ మద్దతుదారులు తేలిగ్గా తీసిపారేస్తున్నారు. ‘మాకు ప్రధాని మోదీ ఒక్కరే తెలుసు. మా ఓట్లన్నీ బీజేపీకే' అని ఇక్కడి హృద్రోగ నిపుణుడు డాక్టర్‌ సచిన్‌ బొహర్‌వాలియా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీఎం విజయ్ రూపానీ అమృతం పథకం ఆరోగ్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రయోజనాలను గుర్తిస్తున్నారని చెప్పారు. ఈ అభిప్రాయంతో నీరజ్‌ గాంధీ అనే న్యాయవాది కూడా అంగీకరించారు. ప్రధాని మోదీ ఈసారి రికార్డు స్థాయిలో విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పాటిదార్ల నాయకుడు హార్దిక్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఉపయోగించుకుంటోందని తప్పుపట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇక్కడ 13 అసెంబ్లీ స్థ్థానాలను గెలిచింది. పాటిదార్ల మద్దతుతో ఆ సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రూపొందించింది. క్రితం ఎన్నికల్లో పాటిదార్లు కేశుభాయి పటేల్‌ ఆధ్వర్యంలోని గుజరాత్‌ పరివర్తన్‌ పార్టీకి మద్దతు తెలిపినా బీజేపీకి ఘనవిజయం సాధించింది. ఇదే పునరావృతం అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు.

English summary
It will take another three months for Bharat Gadhiya, a farmer in Gujarat’s Saurashtra region, to sell his 10 quintals of groundnut at the government’s procurement centre for the promised minimum support price (MSP) of Rs4,500 per quintal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X