వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్నటిదాకా కరవు..ఇప్పుడు ముంచేస్తోన్న వరదలు: దేనికి సంకేతం?

|
Google Oneindia TeluguNews

Recommended Video

వాతావరణ మార్పుల వల్లనే అకాల వర్షాలు || Experts Say That Premature Rains Are Caused By Climate Change

న్యూఢిల్లీ: మొన్నటి దాకా కరవుతో అల్లాడిన పలు రాష్ట్రాలు.. తాజాగా వరద పోటుకు గురయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కరవుకు చిరునామాగా చెప్పుకొనే ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి చోట్ల ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంచనాలకు మించిన వర్షపాతం నమోదవుతోంది. మూడు నెలల కిందటి దాకా వట్టి పోయిన నదులు.. వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఓ మోస్తరు పట్టణాలను ముంచెత్తుతున్నాయి. కసి తీరా, కరవు తీరా కురుస్తున్నాయి ఈ వర్షాలు. అతి సాధారణ వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు పడటం మంచిదే గానీ.. ఉన్నట్టుండి ఇలా ముంచెత్తడం అనేది నిపుణులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఆందోళనకు దారి తీస్తోంది. దీనికి ప్రధాన కారణం.. వాతావరణ మార్పు.

<strong>'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'పై బాంబు పేల్చిన ఆర్జీవీ.. తొలి పాట ట్రైలర్ రేపే! నేతల్లో టెన్షన్...</strong>'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'పై బాంబు పేల్చిన ఆర్జీవీ.. తొలి పాట ట్రైలర్ రేపే! నేతల్లో టెన్షన్...

అన్నీ అధికమే..అంచనాలకు మించి నమోదు..

అన్నీ అధికమే..అంచనాలకు మించి నమోదు..

వాతావరణ మార్పులపై అంతర్జాతీయ ప్యానెల్ (ఇంటర్నేషనల్ ప్యానెల్ ఫర్ క్లైమెట్ ఛేంజ్-ఐపీసీసీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఇదే ప్రమాదాన్ని శంకిస్తోంది. జెనీవాలో ఈ నివేదికను సోమవారం ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం వల్ల వాాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయని, సమతౌల్యం దెబ్బతినడం వల్ల అటు ఎండ కాచినా, ఇటు వానలు కురిసినా..అంచనాలకు మించి నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఐపీసీసీ తాజా నివేదికలో స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరగడానికి గల కారణాలపై అధ్యయనం చేయడానికిక ఏర్పాటైంది ఈ అంతర్జాతీయ ప్యానెల్. తమ తమ దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 118 దేశాల్లో ఈ ప్యానెల్ అధ్యయనం చేసింది.

భూ వినియోగం పెరగడం వల్లేనా?

భూ వినియోగం పెరగడం వల్లేనా?

భూ వినియోగం మితి మీరి పెరగడం వల్లే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఈ ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. అభివృద్ధి, నగరీకరణ పేరుతో అడవులను ఇష్టానుసారంగా నరికి వేయడం వల్ల వాతావరణంలో సమతౌల్యం దెబ్బతింటోంది. నివాసాల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం అటవీ భూమిని సైతం వినియోగంలోకి తీసుకుని వస్తున్నారు. నివాసయోగ్యంగా మార్చుతున్నారు. ఫలితంగా భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉందని ఈ నివేదికలో స్పష్టం చేశారు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే మాట అటుంచితే మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. భూములను నివాస యోగ్యంగా మార్చడం వల్ల పంట ఉత్పత్తి తగ్గుతోందని, ఫలితంగా- జనాభాకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులు సమీప భవిష్యత్తులో ఉండకపోవచ్చని చెబుతున్నారు నిపుణులు.

 అందుబాటులో ఉన్నది 38 శాతమే

అందుబాటులో ఉన్నది 38 శాతమే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి అందుబాటులో ఉన్నది 38 శాతమే. ఈ భూగోళానికి ఊపిరితిత్తులుగా భావించే అమేజాన్ అడవులను విస్తీర్ణం కూడా క్షీణిస్తోందని ఈ నివేదికలో స్పష్టం చేశారు. అమేజాన్ అడవులను నరికేసి, వ్యవసాయానికి అనుగుణంగా మార్చుతున్నారని, క్రమంగా ఆ భూములు కూడా నివాస స్థలాలుగా తయారు కావడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చనేది నిపుణులు చెబుతున్న మాట. ఆయా అంశాల వల్ల భూతాపం పెరగడానికి కారణమౌతోంది. దక్షిణాసియా దేశాల్లో సైతం ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వ్యవసాయంలో రసాయనాలను వినియోగం వల్ల భూతాపానికి మరో కారణం. గత 50 సంవత్సరాలతో పోల్చితే ప్రస్తుతం.. వ్యవసాయంలో రసాయనాల వినియోగం 500 రెట్లు పెరిగిందని ఈ నివేదికలో వెల్లడించారు. రసాయనాల వినియోగం వల్ల ఇప్పటికే భూసారం తగ్గిందనే విషయం అందరికీ తెలిసిందే. దీని ప్రభావం భూతాపం పెరగడంపైనా పడుతోంది.

భూగోళం మీద 75 శాతాన్ని ఆక్రమించిన జనం..

భూగోళం మీద 75 శాతాన్ని ఆక్రమించిన జనం..

ప్రస్తుతం భూగోళం మీద 75 శాతం స్థలంలో జనం నివసిస్తున్నారు. ఫ్యాక్టరీల నిర్మాణం, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం భూమిని వినియోగిస్తున్నారు. పచ్చదనం పెరగాల్సిన ప్రాంతాలన్నీ కాంక్రీటుమయం అవుతున్నాయి. ఫలితంగా వాాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మనదేశంలో పంట విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. పంజాబ్ లో పండించే బియ్యం మొత్తం దేశం మొత్తానికీ సరఫరా అవుతోన్న విషయం తెలిసిందే. రైస్ బౌల్ ఆఫ్ ద ఇండియాగా ఆ రాష్ట్రానికి పేరుంది. అలాంటి చోట కూడా పంట విస్తీర్ణం తగ్గుతోంది.. ఆందోళనకరంగా. సమీప భవిష్యత్తుల్లో పంజాబ్ లో ఉత్పత్తయ్యే మొక్కజొన్న, బియ్యం, గోధుమల పంట శాతం 5.2 శాతానికి పడిపోయే ప్రమాదం ఉన్నట్లు ఈ నివేదికలో పొందుపరిచారు. ఇదే పరిస్థితి దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోందని వెల్లడించారు.

రైతులపై దుష్ప్రభావం..

రైతులపై దుష్ప్రభావం..

వాతావరణ మార్పులు రైతుల నడ్డి విరగ్గొడుతున్నాయి. తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఓ వైపు కరవు, ఇంకో వైపు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనేది రైతాంగమే. అభివృద్ధి, నగరీకరణ పేరుతో చేపడుతున్న కట్టడాల నిర్మాణాల దుష్ప్రభావానికి గురవుతున్నది మొట్టమొదటి బాధితుడు రైతే కావడం బాధాకరమని నివేదికలో స్పష్టంచేశారు. భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు అంచనా వేశారు. దీన్ని నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అత్యంత ప్రమాదకరంగా పెరుగుతోన్న నగరీకరణను గానీ, అనవసర భూ వినియోగాన్ని గానీ అడ్డుకోకపోతే.. సమీప భవిష్యత్తులో సంభవించే భయానక పరిస్థితులకు కారణమౌతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
Land is already under growing human pressure and climate change is adding to these pressures. At the same time, keeping global warming to well below 2ºC can be achieved only by reducing greenhouse gas emissions from all sectors including land and food, the Intergovernmental Panel on Climate Change (IPCC ) said in its latest report on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X