తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల... ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్..
హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. జేఎన్టీయూ హైదరాబాద్లోని ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి, ఎంసెట్ కన్వీనర్ ఎన్. యాదవ్ ఫలితాలు విడుదల చేశారు. ఎంసెట్లో వచ్చిన మార్కులు, ఇంటర్ మార్కుల వెయిటేజీతో కలిపి ఎంసెట్ ర్యాంకులు ప్రకటించారు.
ఇంజనీరింగ్ ర్యాంకర్లు
1. రవి శ్రీతేజ - 95.48 (తాడేపల్లిగూడెం)
2. చంద్రశేఖర్ - 94.65 (హైదరాబాద్)
3. ఆకాశ్ రెడ్డి - 93.16 (హైదరాబాద్)
4. కార్తికేయ - 93.03 (హైదరాబాద్)
5. భానుదత్త - 92.05 (భీమవరం)
6. సాయివంశీ - 91.76, (హైదరాబాద్)
7. సాయి విజ్ఞాన్ - 91.47 (హైదరాబాద్)
8. కశ్యప్ - 91.79 (గిద్దలూరు)
9. వేదప్రణవ్ - 90.60 (హైదరాబాద్)
10. అభిజిత్ రెడ్డి (హైదరాబాద్)

అగ్రికల్చర్ ర్యాంకర్లు
1. ఎంపటి కుష్వంత్ (భూపాల్పల్లి)
2. దాసరి కిరణ్ (రాజమండ్రి)
3. అరుణ్ తేజ (కాకినాడ)
4. సాయి స్వాతి (తిరుపతి)
5. అక్షయ్ (హైదరాబాద్)
6.మోనిషా ప్రియ (తమిళనాడు)
7. శ్రీవాస్తవ (నిజామాబాద్)
8. సిద్ధార్థ్ భరద్వాద్ (విశాఖపట్నం)
9. పూజ (తిరుపతి)
10. హశిత (హైదరాబాద్)
మే 3 నుంచి 9 తేదీల మధ్య జరిగిన ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,31,209మంది పరీక్షలకు హాజరయ్యారు. 68వేల మంది అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్ రాశారు. ఈ నెల 20 నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు.