టీసీఎస్ లో నియామకాలు: భారీగా రిక్రూట్‌మెంట్ డ్రైవ్: బంపర్ LPA

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో దాదాపు అన్ని టెక్ దిగ్గజ సంస్థలు కూడా లేఆఫ్స్ ప్రకటించాయి. దాదాపుగా గత మూడేళ్లుగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తోన్నాయి. లక్షలాదిమంది టెక్కీలు తమ ఉద్యోగాలను కోల్పోతోన్నారు. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కావట్లేదు. దాదాపుగా అన్ని చోట్లా ఏఐ వినియోగం అనేది విస్తృతమౌతోంది. మానవ వనరుల స్థానంలో ఏఐని అడాప్ట్ చేసుకుంటోన్నాయా సంస్థలన్నీ.

Advertisement

ఈ పరిణామాల మధ్య దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన టెక్ కార్యకలాపాల్లో కీలక మార్పులు చేస్తోంది. ఇటీవలి కాలంలో అంతర్గత వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ, ఉద్యోగుల తగ్గింపు తదితర సవాళ్లను ఎదుర్కొన్న ఈ సంస్థ.. ఇప్పుడు ఏఐ సాంకేతికత ఆధారంగా నూతన నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. క్లయింట్లకు అందించే సేవలను మరింత వేగవంతం చేయడానికి ఫార్వర్డ్ డెప్లాయిడ్ ఇంజినీర్లను నియమించుకుంటోంది.

Advertisement

మొత్తం ఉద్యోగుల్లో దాదాపు ఒకటి నుండి 1.5 శాతం మందిని ఈ ఫార్వర్డ్ డెప్లాయ్ మెంట్ విభాగంలోకి తీసుకురావాలని టీసీఎస్ యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం ఉద్యోగుల్లో 1.5 శాతం అంటే.. కనీసం 8,900 మందిని నియమించుకోవడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టనుంది. కిందటి నెల 30వ తేదీన నాటికి టీసీఎస్ గ్లోబల్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 5.93 లక్షలు. దీని ఆధారంగా తీసుకుంటే సుమారు 8,900 మంది వరకు ఫార్వర్డ్ డెప్లాయిడ్ ఇంజినీర్లను నియమించుకునే అవకాశం ఉంది.

తన క్లయింట్లకు ఏఐ ఆధారిత సేవల వినియోగాన్ని మరింత సులభతరం, వేగవంతం చేయడమే దీని వెనుక ఉన్న ప్రధాన వ్యూహం. సాధారణ సాఫ్ట్‌వేర్ డెవలపర్లతో పోలిస్తే ఫార్వర్డ్ డెప్లాయ్డ్ ఇంజినీర్ల నైపుణ్యం, బాధ్యతలు భిన్నంగా ఉంటాయి. నేరుగా క్లయింట్లను కార్యకలాపాలు సాగించే వెసలుబాటు ఉంటుంది. ఆయా సంస్థల అవసరాలకు తగినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ తో అనుసంధానిస్తారు.

Advertisement

ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ తరహా నిపుణులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. గూగుల్ క్లౌడ్, ఓపెన్ఏఐ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఈ తరహా ఉద్యోగాలకు భారీ వేతనాలను ఆఫర్ చేస్తోన్నాయి. అమెరికా గూగుల్ క్లౌడ్ ప్రైమరీ విభాగాలలో ఈ ఉద్యోగాలకు సుమారు రూ. 1.46 కోట్ల నుండి రూ. 2.12 కోట్ల వరకు వార్షిక బేసిక్ శాలరీ చెల్లిస్తున్నారు. ఓపెన్ఏఐ కూడా దాదాపు రూ. 1.89 కోట్ల నుండి రూ. 3.2 కోట్ల వరకు వార్షిక వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది.

రానున్న కాలంలో కేవలం మానవ వనరుల నియామకాలే కాకుండా ఏఐ, డేటా సెక్యూరిటీ, సైబర్ భద్రత విభాగాలలో సేవలందిస్తున్న ఇతర స్టార్టప్‌ల కొనుగోళ్లకు కూడా టీసీఎస్ ఆసక్తి కనబరుస్తోంది. ఇప్పటికే అంతర్గత అవసరాల కోసం ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఈ సంస్థ.. ఛాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ వెర్షన్‌ను తన సిస్టమ్స్‌లో సమర్థవంతంగా వినియోగిస్తోంది.

English Summary

TCS Eyes AI, Data Security, and Cybersecurity Acquisitions as Hiring Accelerates Deployed Engineer. The Indian IT giant believes that AI will create new business instead of weakening the outsourcing model. This comes at a time when SaaS companies globally are facing a difficult time.