చిరంజీవి 40 ఏళ్ల కెరీర్‌లో ఈ సినిమా ఒక మాయని మచ్చ


నందమూరి తారక రామారావు హయాం నుంచి నేటి తరం వరకు తెలుగు సినీ యవనికపై తనదైన ఆధిపత్యం చెలాయిస్తున్న ఏకైక కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆయన ఖాతాలో ఓటములు చాలా అరుదు. అయితే, తన కెరీర్‌లో 'బిగ్ బాస్', 'మృగరాజు', 'భోళా శంకర్' వంటి ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ.. 'ఆచార్య' మిగిల్చిన చేదు అనుభవం మాత్రం మెగా అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఎప్పటికీ మరచిపోలేనిదిగా నిలిచింది.

Advertisement

రేటింగ్ 1 ఇచ్చారు

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పూర్తి స్థాయి కీలక పాత్ర పోషించడంతో 'ఆచార్య'పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తండ్రీకొడుకుల అరుదైన కలయికను వెండితెరపై చూసేందుకు థియేటర్లకు తరలివచ్చిన ప్రేక్షకులకు తొలి రోజే తీవ్ర నిరాశ ఎదురైంది. డిస్ట్రిబ్యూటర్లు, విమర్శకులు ఈ చిత్రానికి అతి తక్కువగా 1 లేదా 1.5 రేటింగ్స్ ఇచ్చారంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
భీమ్‌రెడ్డి జాబితాలో సినీ హీరో - రూ.3 కోట్ల అడ్వాన్స్‌, అగ్రిమెంట్..!?

పట్టుమని వారం రోజులు కూడా ఆడకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోయిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా వల్ల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు సుమారు రూ. 100 కోట్లకు పైగా భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తమ ఉదారతను చాటుకున్నారు. తమ పారితోషికంలో ఏకంగా 80 శాతం సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేశారని చిరంజీవి స్వయంగా పలు వేదికలపై వెల్లడించారు.

Advertisement

కథలో వేగం లేదు

ఈ భారీ డిజాస్టర్‌కు కథనంలో వేగం లోపించడమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కొరటాల శివ సోషల్ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ, కథనం సాగదీసినట్లుగా సాగి ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. దానికి తోడు చిరంజీవి మార్క్ కామెడీ, ఈజ్, గ్రేస్‌లు సినిమాలో ఎక్కడా కనిపించకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రూ. 140 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ, సినిమాలో విజువల్స్, గ్రాఫిక్స్ పనులు నాసిరకంగా ఉండటంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.

సమోసాలు అమ్మిన చేతులతోనే సినీ పరిశ్రమను శాసిస్తున్నాడు

ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ ఏమాత్రం సహజత్వానికి దగ్గరగా లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. చిరంజీవి స్థాయి ఇమేజ్‌కి తగిన సన్నివేశాలు డిజైన్ చేయడంలో దర్శకుడు విఫలమవ్వడంతో, 'ఆచార్య' చిత్రం మెగాస్టార్ 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో చెరిగిపోని ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.

English Summary

Acharya: In Chiranjeevi's 40-year career, the movie stands out as a disaster earning a rating of just 1 and remains an indelible blot on his record.