మీ జిల్లాలోనే బ్యాంక్ జాబ్స్.. 338 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 338 ఉద్యోగాల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశమని, అర్హత కలిగిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Advertisement

4 రెట్లు ఎక్కువ వడ్డీ! బ్యాంకులు చెప్పని పెద్ద సీక్రెట్
Advertisement

ఏయే పోస్టులు? ఎవరు అర్హులు?

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ కేటగిరీలకు చెందిన పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కలిగి ఉండి, తమ చదువులో ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు చదివిన వారికి ఎంపిక ప్రక్రియలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని స్పష్టం చేశారు.

డిగ్రీ ఉంటే చాలు.. బ్యాంక్‌లో రూ.85 వేల జీతంతో ఉద్యోగం!
Advertisement

ఆగస్టు 7 వరకు అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి!

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 7వ తేదీ లోపు తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉండటంతో చివరి క్షణం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. అభ్యర్థులు డైరెక్ట్‌గా ఏపీకాబ్ అధికారిక పోర్టల్ లోకి వెళ్లి నోటిఫికేషన్ వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

English Summary

APCOB releases notification for 338 Assistant Manager and Staff Assistant posts. Degree holders aged 20-30 can apply online before August 7.