మీకు మ్యూజిక్ వచ్చా? ఎయిర్‌ఫోర్స్‌లో సూపర్ ఆఫర్..

మ్యూజిక్ అంటే ఇష్టం ఉండి, దేశసేవ చేయాలనే తపన ఉన్న యువతకు భారతీయ వాయుసేన అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా 'అగ్నివీర్‌వాయు మ్యూజిషియన్' పోస్టుల భర్తీకి సంబంధించి తాజా నోటిఫికేషన్ (2027-1 ఇంటేక్) విడుదల చేసింది. కేవలం పదో తరగతి విద్యార్హత కలిగి ఉండి, వివిధ రకాల సంగీత పరికరాలు వాయించడంలో ప్రావీణ్యం ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ బ్యాండ్‌లో తమ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది.

Advertisement

సెలక్షన్ ర్యాలీ వివరాలు...

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఢిల్లీ, బెంగళూరు కేంద్రాల్లో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 9 వరకు సెలక్షన్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ ప్రదేశానికి వెళ్లే సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు తమకు నైపుణ్యం ఉన్న వాద్య పరికరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పత్రాల పరిశీలన అనంతరం ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT-1, PFT-2) నిర్వహిస్తారు. పీఎఫ్‌టీలో అర్హత సాధించిన వారికి 30 నిమిషాల వ్యవధిలో 30 మార్కులకు ఆంగ్ల సబ్జెక్టుపై పదో తరగతి స్థాయిలో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేని ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు. ఆ తర్వాత మ్యూజిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

Advertisement

దేహదారుఢ్య కొలతలు... శారీరక పరీక్షలు...

పీఎఫ్‌టీ-1లో భాగంగా 1.6 కిలోమీటర్ల దూరాన్ని పురుషులు 7 నిమిషాల్లో, మహిళలు 8 నిమిషాల్లో చేరుకోవాలి. ఇందులో క్వాలిఫై అయిన వారికి పీఎఫ్‌టీ-2 ఉంటుంది. దీనిలో పురుషులు 10 పుషప్స్, 10 సిటప్స్, 20 స్క్వాట్స్ పూర్తిచేయాల్సి ఉండగా, మహిళలు 10 సిటప్స్, 15 స్క్వాట్స్ పూర్తిచేయాలి. దేహదార్ఢ్య విషయానికి వస్తే పురుషులు కనీసం 162 సెం.మీ, మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండటం తప్పనిసరి.

పరీక్ష లేదు.. ఓన్లీ ఇంటర్వ్యూతోనే ఆర్మీ ఉద్యోగం! లక్షన్నర జీతం

ఆకర్షణీయమైన వేతనం... సేవానిధి ప్యాకేజీ!

ఎంపికైన అగ్నివీరులకు నాలుగేళ్ల సర్వీస్ కాలంలో ఆకర్షణీయమైన వేతనంతో పాటు పలు సౌకర్యాలు లభిస్తాయి. తొలి ఏడాదిన నెలకు రూ.30,000 జీతంతో ప్రారంభమై, నాల్గో ఏడాదికి రూ.40,000 వరకు ప్రతి నెలా చెల్లిస్తారు. వీటితో పాటు అలవెన్సులు, ఏడాదికి 30 రోజుల సెలవులు, రూ.48 లక్షల జీవిత భీమా వర్తిస్తుంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత ప్రతి నెలా జమ చేసిన కార్పస్ ఫండ్, ప్రభుత్వ వాటా కలిపి రూ.10.04 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని 'సేవానిధి' రూపంలో అందజేస్తారు. అలాగే అగ్నివీర్‌వాయు స్కిల్ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది.

Advertisement

శాశ్వత ఉద్యోగం... ఇతర అవకాశాలు!

నాలుగేళ్ల సేవలు ముగిసిన తర్వాత ప్రతిభ, సంస్థ అవసరాల ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం మందికి వాయుసేనలో శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తారు. మిగిలిన వారికి సొంతంగా వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం అందేలా చూస్తారు. అంతేకాకుండా కార్పొరేట్, ప్రైవేట్ రంగాల్లో వీరికి మొదటి ప్రాధాన్యత లభిస్తుంది.

డిగ్రీ ఉంటే చాలు.. బ్యాంక్‌లో రూ.85 వేల జీతంతో ఉద్యోగం!

దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్య వివరాలు...

  • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్ గ్రేడ్-5 లేదా డిప్లొమా/సమాన స్థాయి సర్టిఫికెట్ ఉండాలి.
  • వయోపరిమితి: జనవరి 1, 2005 నుంచి జులై 1, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 2.
  • రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (జీఎస్‌టీ అదనం).
  • అధికారిక వెబ్‌సైట్: agnipathvayu.cdac.in లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

English Summary

Indian Air Force announces Agniveer Vayu Musician recruitment rally for 10th pass candidates. Check eligibility, salary, selection process, and application details.