TGPSC గుడ్ న్యూస్.. టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ !!


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు టీజీపీఎస్సీ (TGPSC) మరో శుభవార్త చెప్పింది. ఇటీవల పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన కమిషన్.. తాజాగా టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ (Town Planning Assistant) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Advertisement

ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7 పోస్టుల్లో 2 రాష్ట్ర స్థాయి (State Cadre) పోస్టులు, 5 మల్టీ జోనల్ (Multi-Zonal) పోస్టులు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు పట్టణ ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ల రూపకల్పన, నగరాభివృద్ధి ప్రాజెక్టులు, భూ వినియోగ ప్రణాళిక, మున్సిపల్ అభివృద్ధి వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Advertisement

విద్యార్హత..

B.Planning (Bachelor of Planning) లేదా B.Tech (Planning)

నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఇతర అర్హతలు, సర్టిఫికెట్లు కూడా అభ్యర్థులు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం..

2026 అక్టోబర్ నెలలో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షలో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష తేదీలు, హాల్ టికెట్ విడుదల, పరీక్షా కేంద్రాల వివరాలను టీజీపీఎస్సీ అనంతరం అధికారికంగా ప్రకటించనుంది.

దరఖాస్తు గడువు..

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 15 జూలై 2026
దరఖాస్తుల చివరి తేదీ: 22 ఆగస్టు 2026

Advertisement

అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి One Time Registration (OTR) వివరాలను నవీకరించిన తర్వాత సంబంధిత నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించే ముందు వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, అప్లోడ్ చేసిన సర్టిఫికెట్లు అన్నీ సరిచూసుకోవాలి.

అభ్యర్ధులకు సూచనలు..

రాత పరీక్ష సిలబస్, పరీక్షా విధానం, దరఖాస్తు రుసుము, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం తప్పనిసరి.

English Summary

TGPSC has another piece of good news for the unemployed people waiting for government jobs in Telangana. It has recently released an official notification for the recruitment of Town Planning Assistant posts.