బాలీవుడ్ మిస్టర్ పర్పెఖ్ట్ అమీర్ ఖాన్ మూడో పెళ్లి గురించి ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా రాయల్ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ చేసిన ఓ ప్రకటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇస్లాంలో ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవడం అనుమతించబడదని.. అలా చేసిన వారు షరియా చట్టం ప్రకారం దోషులుగా పరిగణించబడతారని ఆ మత గురువు పేర్కొన్నారు.
ఘనంగా అమీర్ ఖాన్ మూడో పెళ్లి.. మాజీ భార్యలు, పిల్లల సమక్షంలో
ముస్లిమేతర స్త్రీని వివాహం చేసుకోవడం షరియా చట్టానికి విరుద్ధమని మౌలానా ఇఫ్రాహిం హుస్సేన్ పేర్కొన్నారు. అటువంటి నిర్ణయాలు ఇస్లాం బోధనలకు, షరియా చట్టానికి విరుద్ధంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రతిష్టను దెబ్బతీస్తాయని, సమాజానికి ప్రతికూల సందేశాన్ని పంపుతాయని ఆయన అన్నారు. ప్రజలందరూ తమ మత బోధనలను గౌరవించాలని, అపార్థాలకు, సమాజంపై ప్రతికూల ప్రభావానికి దారితీసే నిర్ణయాలకు దూరంగా ఉండాలని ఆయన ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. ఇస్లామేతర మహిళను వివాహం చేసుకోవడం షరియాకు విరుద్ధమని, ఇస్లాం పేరును మలినం చేస్తుందని ఆ మత గురువు తన ప్రకటనలో తెలిపారు.
జులై 5న జరిగిన అమీర్ ఖాన్ మూడో వివాహం ఇది అమీర్ ఖాన్‌కు మూడో వివాహం. ఆయన 1986లో రీనా దత్తాను తొలిసారిగా వివాహం చేసుకున్నారు. వారు చాలా ఏళ్లు కలిసి ఉన్నారు, కానీ 2002లో విడిపోయారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ 2005లో చిత్ర దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. ఈ బంధం కూడా చాలా కాలం కొనసాగింది, కానీ వారు 2021లో విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్ మూడో వివాహం గతంలో రాజకీయ వ్యతిరేకతను రేకెత్తించింది. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి నితేష్ రాణే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీని తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, శివసేన నాయకుడు సంజయ్ షిర్సత్ కూడా సోమవారం ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని విమర్శించారు.
అమీర్ ఖాన్ మూడో వివాహానికి సంబంధించి మత గురువు చేసిన ఈ ప్రకటన వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రకటన అనంతరం ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల స్పందనలు కనిపిస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను జులై 5, 2026న వివాహం చేసుకున్నారు. ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న ఆయన ఇంట్లో, కేవలం సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం ప్రైవేటుగా జరిగింది.ఆ టాలీవుడ్ స్టార్ హీరోకి ఎంత ఆస్తి ఉందో తెలిస్తే మైండ్ బ్లాంకే !!