ఆ హీరో షూటింగ్ చేస్తుండగా.. ముద్దు పెట్టుకుంటూ అక్కడ కూడా పట్టుకున్నాడు !!


సినీ పరిశ్రమ వెలుగుల ప్రపంచంలా కనిపించినప్పటికీ.. తెర వెనుక జరిగే కొన్ని చేదు అనుభవాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు షూటింగ్‌ల సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి గతంలో పలువురు నటీమణులు బహిరంగంగానే మాట్లాడారు. తాజాగా బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా కూడా తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఓ అసౌకర్యకరమైన ఘటనను బయటపెట్టి సంచలనం సృష్టించారు.

Advertisement

తెలుగు ప్రేక్షకులకు 'పోటుగాడు' సినిమాతో పరిచయమైంది "అనుప్రియా గోయెంకా". ఆ తర్వాత హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 'బాబీ జాసూస్', 'పద్మావత్', 'వార్', 'టైగర్ 3' వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. 'అసుర్', 'ఆశ్రమ్', 'పాంచాలి' వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న పాత్రలతో నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈ బ్యూటీ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు.

Advertisement

ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో ఓ ఇంటిమేట్ సీన్ ఉండగా, స్క్రిప్ట్ ప్రకారం సహనటుడు తన నడుము పట్టుకుని లిప్ కిస్ చేయాల్సి ఉందని తెలిపారు. కథకు అవసరమైన సన్నివేశం కావడంతో తాను కూడా అంగీకరించానని చెప్పారు. అయితే షూటింగ్ సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అనుప్రియా వెల్లడించారు. సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆ నటుడు స్క్రిప్ట్‌లో లేని విధంగా తనను తాకరాని చోట తాకాడని ఆమె ఆరోపించారు.

Advertisement

ఆ క్షణంలో తీవ్ర అసౌకర్యంగా అనిపించినప్పటికీ, షూటింగ్ ఆగిపోతుందేమోనన్న ఆలోచనతో వెంటనే స్పందించలేదని చెప్పారు. "ఆ విషయం గురించి అక్కడే ప్రశ్నిస్తే.. 'అనుకోకుండా జరిగిపోయింది' అని చెప్పేవాడని అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాను. కానీ ఆ సంఘటన నన్ను మానసికంగా చాలా బాధపెట్టింది" అని అనుప్రియా పేర్కొన్నారు. ఆ సన్నివేశంలో తాను పూర్తిగా ప్రొఫెషనల్‌గా వ్యవహరించగా, ఎదుటి వ్యక్తి మాత్రం తన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయాడని వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఘటన తన జీవితంలో ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు కూడా మరోసారి ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఆమె వెల్లడించారు. అయితే ఆ సమయంలో కూడా పెద్దగా బయటకు చెప్పలేకపోయానని, ఇప్పుడు మాత్రమే ఈ విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నానని తెలిపారు. సినీ పరిశ్రమలో మహిళల భద్రత, షూటింగ్ సెట్లలో ప్రొఫెషనల్ హద్దులు, సమ్మతి (Consent) వంటి అంశాలపై గత కొంతకాలంగా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనుప్రియా గోయెంకా చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి ఆ అంశాలను తెరపైకి తీసుకొచ్చాయి

English Summary

Popular Bollywood actress 'Anupriya Goenka' is also known to Tollywood audiences. Speaking in an interview, she made shocking comments. She commented that she lost control during the shooting and put her hand there while kissing an actor.