సినిమాల కోసం ఆ కఠిన నిర్ణయం తీసుకున్నా: భాగ్యశ్రీ బోర్సే

సినిమాల్లోకి రావడం అనేది చాలా మంది యువతకు ఓ కల లాంటింది. కానీ ప్రతి ప్రయాణం అంత సులువుగా సక్సెస్ కాదు. ఒకవేళ సెక్సెస్ అయినా ఆ ప్రయాణం అడ్డంకులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో కష్టమైన విషయం. మహిళలు ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. తాజాగా స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవలి ఇంటర్వ్యూ ఆ వాస్తవాన్ని గుర్తు చేస్తుంది. తనకు యాక్టింగ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌ను తమ కుటుంబ సభ్యులెవరూ మొదట్లో ప్రోత్సహించలేదని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే వెల్లడించారు. అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించిన సినిమా 'లెనిన్' అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో ఓ కాలేజీ విద్యార్థులతో టాక్ షోలో ఆమె ముచ్చటించారు. తన సినిమా జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Advertisement
'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?
Advertisement

ఆ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే ముచ్చటిస్తూ.. తాను సినిమాల్లో కెరీర్ కొనసాగించాలని నిర్ణయించుకున్నప్పుడు తన కుటుంబం మద్దతు ఇవ్వలేదని వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులందరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ నిరాశ చెందకుండా, ఆ నటి తన కలను సాకారం చేసుకోవడానికి అనేక ఆడిషన్లకు హాజరయ్యారు. ఆ సమయంలో భాగ్యశ్రీ సినీ పరిశ్రమలో కెరీర్‌ను ఎంచుకున్నందున, ఆమె తల్లి ఆరు నెలల పాటు ఆమెతో మాట్లాడటానికి నిరాకరించింది. వాట్సాప్‌లో కూడా ఆమెను బ్లాక్ చేసింది. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, అది తన జీవితంలో ఒక బాధాకరమైన దశ అని భాగ్యశ్రీ బోర్సే చెప్పుకొచ్చింది. చెప్పింది.

Advertisement

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?

భావోద్వేగపరమైన ఎదురుదెబ్బలు తగిలినా, ఆ నటి ఏకాగ్రతతో కష్టపడి పనిచేసింది. ఈ రోజు ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇతరులెవరూ నమ్మనప్పుడు, కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నమ్మడమే చాలని నిరూపిస్తూ భాగ్యశ్రీ ఇప్పుడు తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది.

English Summary

Actress Bhagyashri Borse shares her inspiring journey, revealing how her family opposed her acting entry and her mother blocked her for six months.