ఒకే ఒక్క వెబ్ సిరీస్.. ఓవర్ నైట్ లోనే కుర్రాళ్లను ఫిదా చేసిన బ్యూటీ !!

"దీప్తి సతి".. పేరు వింటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. ఆమె నటించిన వెబ్ సిరీస్ పేరు చెప్తే మాత్రం గుర్తు పట్టనివారు ఉండరు. ఇంతకీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ఏదో కాదు "సిన్". తిరువీర్ హీరోగా నటించిన ఈ మూవీ ఆహా వేదికగా రిలీజ్ అయ్యి తెలుగు ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. మోడలింగ్‌ రంగం నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ అందగత్తె.. టాలెంట్‌, పర్ఫార్మెన్స్‌తో బహుభాషల్లో తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.

Advertisement

ఫ్యామిలీ..

దీప్తి తండ్రి మరాఠీ, తల్లి మలయాళీ కావడంతో ఆమెకు రెండు భాషలు మాతృభాషలుగా మారాయి. ముంబైలో పెరిగిన కారణంగా హిందీ, ఇంగ్లిష్‌లోనూ మంచి ప్రావీణ్యం సంపాదించింది. సినిమాల కోసం ఆమె తమిళం, కన్నడ కూడా నేర్చుకుంది. చదువుల్లో మాత్రమే కాదు, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండే దీప్తి చిన్ననాటి నుంచే కళలంటే మక్కువ చూపింది. మూడేళ్ల వయసులోనే కథక్‌, భరతనాట్యంలో శిక్షణ పొందింది. అనేక స్టేజ్‌ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Advertisement

మోడలింగ్ టూ సినిమా..

కాలేజీ రోజుల్లో ఒక ప్రైవేట్‌ సంస్థ నిర్వహించిన 'ఫ్రెష్‌ ఫేస్‌ హంట్‌' పోటీ ఆమె జీవితాన్ని మార్చేసింది. అప్పుడు సరదాగా ర్యాంప్‌ వాక్‌ చేసిన దీప్తి తర్వాత పూర్తి స్థాయి మోడల్‌గా మారింది. 2012లో ఆమె 'మిస్‌ కేరళ' టైటిల్‌ గెలుచుకుంది. ఆ తర్వాత Femina Miss India 2014, Navy Queen 2011 వంటి పలు పోటీల్లో పాల్గొని మెప్పించింది. ఆ తర్వాత ఫోటో షూట్స్‌, అడ్వర్టైజ్‌మెంట్స్‌ తో మంచి ఫాలోయింగ్ పెంచుకుంది.

మొత్తంగా సతి 2015లో వచ్చిన మలయాళ సినిమా 'నీనా'తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా 'డ్రైవింగ్‌ లైసెన్స్‌', 'కింగ్‌ లైర్‌', 'కాప్టెన్‌' వంటి చిత్రాల్లో నటించి, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక తమిళంలో కూడా సోలో, కన్నడలో 'జాగ్వార్‌', 'చిరునవ్వు' వంటి చిత్రాల్లో నటించింది. పలు భాషల్లో ఆమె ప్రతిభ చాటుకోవడం ద్వారా దక్షిణ భారత చిత్రసీమలో బలమైన స్థానం సంపాదించుకుంది. అలాగే యూట్యూబ్‌లో విడుదలైన 'లాక్‌డౌన్‌ టాక్స్‌' సిరీస్‌ ఆమెకు మంచి ఫాలోయింగ్‌ తెచ్చింది. MX Playerలో వచ్చిన 'ఓన్లీ ఫర్‌ సింగిల్స్‌' సిరీస్‌తో ఆమె యువతలో పాపులర్‌ అయ్యింది.

English Summary

Actress "Deepti Sati" was introduced to the Telugu audience with the web series 'Sin', which came out on the Aha OTT platform.