ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు సల్మాన్ ఖాన్, ఆలియా భట్, కరీనా కపూర్, ఇమ్రాన్ ఖాన్, షబానా అజ్మీతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి జ్యోతిక కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు తమ మద్దతును ప్రకటించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పోస్టులు పెట్టినప్పటికీ.. జ్యోతిక పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.

Advertisement
ధర్మేంద్ర ప్రధాన్ పై మారుతున్న ఆలోచన, కీలక పరిణామాలు-నేడే..!?
Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలన్న డిమాండ్‌కు , విద్యార్థుల నిరసనలకు నటి జ్యోతిక తన మద్దతును తెలిపారు. "ధర్మేంద్ర ప్రధాన్, పదవి నుంచి తప్పుకోండి. రాజీనామా చేయండి. నేను విద్యార్థుల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నిలబడతాను.నేను జవాబుదారీతనం కోసం నిలబడతాను, నేను ప్రజాస్వామ్య భారతదేశం కోసం నిలబడతాను! నేను సంస్కరించబడిన విద్యా వ్యవస్థ కోసం నిలబడతాను! నేను సోనమ్ వాంగ్‌చుక్ కోసం నిలబడతాను. నేను నా పిల్లలను మీలాగే పెంచుతాను. మేము తల్లులుగా మా పిల్లలను సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ లాగా పెంచాలి. నిర్భయంగా మాట్లాడే 'జెన్ జెడ్' తరమైన మీ పట్ల మాకు గర్వంగా ఉంది. వారిని నిర్భయంగా తీర్చిదిద్దినందుకు సీజేపీకి ధన్యవాదాలు, జై హింద్" అని జ్యోతిక పేర్కొన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని సూచనలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం జరిగే చర్చలో ఇతర డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సీజేపీకి తెలియజేయనుంది. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగిస్తే మరిన్ని నిరసనలు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్త నిరసన చేపట్టి, 24 గంటల్లోగా పార్లమెంట్ మార్చ్‌ను తిరిగి ప్రారంభిస్తామని సీజేపీ ప్రకటించింది.

ఢిల్లీ పోలీసుల భలే ఎత్తుగడ- కాక్రోచ్ ల ముఖాలు లైవ్ స్కాన్

సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం జరపనున్న కీలక సమావేశం మధ్యాహ్నం జరగనుంది. ఇదిలా ఉండగా.. నిరసనల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు, మరిన్ని బారికేడ్లను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈరోజు 18 మెట్రో స్టేషన్లను మూసివేయనున్నారు.

English Summary

Actress Jyothika supports Cockroach Janata Party Jantar Mantar protest, demanding Dharmendra Pradhan resignation. Read her viral Instagram post.