ఎన్టీఆర్ #GODOFWAR మూవీలో హీరోయిన్ ఫిక్స్.. జోడీ అదిరిపోద్ది !!


గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే దేవర చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో "డ్రాగన్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. అలానే తారక్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అప్డేట్ రీసెంట్ గానే వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. #NTRxTrivikram అనే వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను పంచుకున్నారు. ''శివుడి కుమారుడు.. పార్వతి దేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో'' అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Advertisement

ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. అయితే ఆ మూవీని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అంతకు ముందు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చేలా నాగవంశీ ఇటీవల ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసిన ట్వీట్లు.. అలానే ఎన్టీఆర్ కూడా 'లార్డ్ మురుగన్' పుస్తకంతో కనిపించడంతో అభిమానులు సైతం అప్పుడే ఫిక్స్ అయిపోయారు.

Advertisement

ఆ హీరోయిన్ ఎవరంటే..?

అయితే నాగ చైతన్య సరసన "సాహసం శ్వాసగా సాగిపో" అనే సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ నటి " మంజిమా మోహన్ ". 2019లో విడుదలైన ఎన్టీఆర్ 'కథానాయకుడు' లో నారా భువనేశ్వరి పాత్రలో కూడా ఆమె నటించారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే కోలీవుడ్ హీరో గౌతమ్ కార్తిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వివాహం 2022లో గ్రాండ్ గా జరిగింది. ఆ తర్వాత నుంచి అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

Advertisement

కొద్ది రోజులు క్రితం ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'లార్డ్ మురుగన్' పుస్తకం తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ చిత్రంలో హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది అని జోరుగా ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇక ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించిన 'లార్డ్ మురుగన్' పుస్తకం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మరో హీరోయిన్ సైతం ఆ బుక్ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపికైందా? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు మురుగన్ కి ఇద్దరు భార్యలు ఉన్నట్టు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో ఒకరు ఇంద్రుని కుమార్తె అయిన దేవసేన కాగా.. మరొకరు గిరిజన యువతి వల్లి. మరి ఇప్పుడు తెరకెక్కించబోయే చిత్రంలో ఈమెకు ఏ పాత్ర ఇస్తారో తెలియాలంటే ఎదురుచూడక తప్పదు.

English Summary

Global star and young tiger NTR is making waves with a series of films. He has already scored a solid hit with the film Devara this year. It is known that he is currently working on dragon film under the direction of Prashanth Neel.