అదా శర్మ.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2008లో దర్శకుడు విక్రమ్ భట్ తెరకెక్కించిన హారర్ చిత్రం '1920'తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమె నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పూరి జగన్నాథ్ - నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' మూవీతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత ఆమె 'సన్నాఫ్ సత్యమూర్తి', 'క్షణం' వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్నన పొందింది.
కాగా 'కల్కి'లో రాజశేఖర్ సరసన నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రాల తర్వాత అదా శర్మ బాలీవుడ్‌లోకి మళ్లీ దృష్టి సారించింది. తన అందం, గ్లామర్‌తో పాటు పాత్రల ఎంపికతో అదా శర్మ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అయితే అదా కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అంటే కేరళ స్టోరీ అనే చెప్పాలి.
అయితే 2023లో విడుదలైన 'ది కేరళ స్టోరీ' చిత్రం అదా శర్మ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసింది. తీవ్ర రాజకీయ వివాదాల మధ్య వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా విజయంతో అదా శర్మ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అనేక జాతీయ స్థాయి మీడియా ఇంటర్వ్యూలు, టాక్ షోలు ఆమెను స్పాట్‌లైట్‌లోకి తెచ్చాయి. ఈ క్రమంలోనే గతంలో అదా శర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ విడుదలైనప్పుడు సగం దేశం నన్ను చంపాలని ప్రయత్నించింది. కానీ మిగతా సగం దేశం నన్ను ప్రేమించింది, రక్షించింది" అని వెల్లడించారు. సవాలు ఉన్న పాత్రలే కెరీర్‌కు విలువ ఇస్తాయి. 1920 నుంచే నేను రిస్క్ ఉన్న రోల్స్ ఎంచుకున్నాను. ఆ రిస్క్ వల్లే నాకు ఇవాళ గుర్తింపు వచ్చింది. పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్ సీన్లు ఉండాలి," అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం అదా శర్మ బాలీవుడ్‌లో పలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, ఫిట్‌నెస్ వీడియోలు, డాన్స్ క్లిప్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లామరస్ ఫోటోషూట్లతో ఆమె తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తుంది.