చాలామంది సెలబ్రిటీలు తెగ కష్టపడిపోతుంటారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక హీరోయిన్లు మరింత కేర్ తీసుకుంటారు. స్టోరీ సెలక్షన్ దగ్గరినుంచి గ్లామర్ డోస్, ఐటైమ్ సాంగ్స్, రొమాన్స్ ఇలా ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతుంటారు. అయితే సినిమా ఫలితాన్ని అంతిమంగా డిసైడ్ చేసేది ప్రేక్షకులు మాత్రమే. వాళ్ల చేతిలోనే నటీనటుల భవితవ్యం ఉంటుంది. ఇక టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల విషయానికి వస్తే ఆమె పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు పెద్ద సినిమాలు చేసింది. ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, రాబిన్ హుడ్, జూనియర్, మాస్ జాతర, పరాశక్తి, అలాగే ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేసింది.
అయితే బ్యాడ్ లక్ ఏంటంటే..? ఇవేవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ కాలేదు. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల.. బాలయ్య కుమార్తెగా నటించి మెప్పించింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది. ఇక మిగతా సినిమాలేవీ ఆశించినంత విజయాలు కాలేదు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి వారితో నటించినా శ్రీలీల ఫేట్ మారలేదు. ఈ క్రమంలో ఇటీవల శ్రీలీల ను మూవీ అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.
ఇక అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ లెనిన్ లో మొదటగా శ్రీలీల ను తీసుకున్నారు. కొంతభాగం షూటింగ్ కూడా జరిగింది. కానీ పలు కారణాల వల్ల ఆమెను తొలగించి మరో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేను తీసుకొచ్చారు. అయితే ఈ మూవీలో శ్రీలీలను తొలగించడానికి గల కారణాలను ఇటీవల లెనిన్ చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఆమె సినిమాలు ఫెయిల్ అవ్వడం కారణంగా ఈ చిత్రం నుంచి తీసేయలేదని శ్రీలీల డేట్స్ కుదరకపోవడం వల్లే ఇది జరిగిందని అన్నారు.
అయితే లెనిన్ మూవీకి తాజాగా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మూవీలో అక్కినేని అఖిల్- భాగ్య శ్రీ భోర్సే కాంబోలో కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు. శ్రీలీలను ఈ మూవీ నుంచి తొలగించి భాగ్య శ్రీ ను తీసుకోవడం సినిమా విజయానికి మేజర్ ప్లస్ పాయింట్ అయిందని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా లెనిన్ విజయంతో అఖిల్ చాలా ఏళ్ల తర్వాత హిట్టు కొట్టాడని చెప్పొచ్చు.