అక్కినేని అఖిల్ స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చినా ఇప్పటివరకూ సరైన హిట్ పడలేదు. ఆయన గతంలో నటించిన ఏజెంట్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. దాంతో ఈసారి కసిగా ఎలాగైనా హిట్ కొట్టాలన్న తాపత్రయంతో తీసిన సినిమా లెనిన్.. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూలై 10 న విడుదల అయింది. ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది. అఖిల్ ను కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
గతేడాది అన్న అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. ఇప్పుడు తమ్ముడు అఖిల్ లెనిన్ మూవీతో రూ. 100 కోట్లు కొళ్లగొట్టి తన సత్తా చాటాడు. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. లెనిన్ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ అబ్బూరి అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ మూవీలో అఖిల్ నటవిశ్వరూపం చూపించాడు. అఖిల్ సరసన భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. మొత్తానికి దాదాపు పదేళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమాతో అఖిల్ కు బ్లాక్ బస్టర్ దక్కిందనే భావించవచ్చు.
అఖిల్ కెరీర్ లోనే తొలి రూ. 100 కోట్ల సినిమా ఇదే కావడంతో ఈ మేరకు తనను ఇంతలా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ అక్కినేని అఖిల్ ఎక్స్ లో ఓ పోస్టర్ తో పాటు పోస్టు పెట్టారు. 'నన్ను ఎవరైతే నమ్మి, మద్దతు ఇచ్చి, స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది మీ కోసమే. అపారమైన కృతజ్ఞతాభావంతో ముందడుగు వేస్తున్నాను. థాంక్యూ అందరికీ. మరో సినిమాతో త్వరలోనే మీ ముందుకు వస్తాను' అని పోస్టు పెట్టారు.
ఈ విజయంతో అఖిల్ కు సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ మూవీ తర్వాత అఖిల్ ఎలాంటి స్క్రిప్ట్ ను ఓకే చేస్తారు..? మరోసారి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందా..? లేక ఇతర కథలను ఏమైనా ఎంచుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అఖిల్ లెనిన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.