2 సర్జరీలు జరిగాయి.. 48 కుట్లు పడ్డాయ్.. 16 నెలలు రెస్ట్ - అఖిల్

తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వర్గీయ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు టాలీవుడ్ చరిత్రలో మరపురాని పేజీలను లిఖించుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా రాణిస్తున్నారు. కాగా కింగ్ వారసుడిగా సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు "అఖిల్". కాగా అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, ఏజంట్ సినిమాల్లో నటించినా.. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

ప్రస్తుతం అఖిల్ నటించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం 'లెనిన్'. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుని సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. జూలై 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ గానే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా.. యూట్యూబ్లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

Advertisement

లెనిన్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ మాట్లాడుతూ.." ఏజెంట్ సినిమా తర్వాత నేను వరుసగా సినిమాలు చేయాల్సింది. అయితే ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు నేను బాత్రూంలో జారి పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు చాలా బలంగా గుచ్చుకున్నాయి. దీంతో ఎడమ చేతి వేళ్ళకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. ఇక 16 నెలల పాటు నేను విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ మూడేళ్ల గ్యాప్ వచ్చింది " అంటూ వివరణ ఇచ్చారు అఖిల్.

Advertisement

మరోవైపు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక రీసెంట్ గానే ఘనంగా జరిగింది. జూన్ 6వ తేదీన హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఆ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

English Summary

Akkineni Akhil is acting in the film "Lenin". Directed by Murali Kishore Abbur, the film stars Bhagya Sri Borse as the female lead. Akkineni Nagarjuna and Suryadevara Nagavamsi are jointly producing the film.