అఖిల్ లెనిన్ ఫస్ట్ రివ్యూ.. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఊచకోతే !!


అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ చిత్రం "లెనిన్". వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ పై.. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మయూకీక డైరెక్టర్ తమన్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను దక్కించుకుని సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. జూలై 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

ఈ యంగ్ హీరో సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. "అఖిల్" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను సినిమాలతో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ కావడంతో దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.

Advertisement

ఫస్ట్ రివ్యూ..

ఈ చిత్రానికి'U/A' సర్టిఫికెట్‌ ఇవ్వగా.. సెన్సార్ నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. క్రిస్పీ రన్ టైంతో, స్క్రీన్ ప్లే ఎక్కడా పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుందని సెన్సార్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా సెకండాఫ్ బలమైన భావోద్వేగాలతో ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అఖిల్ విశ్వరూపం చూపించారని, ట్విస్టులు అదిరిపోయాయని అంటున్నారు. ప్రధాన జంట, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని సెన్సార్ టాక్ ని బట్టి తెలుస్తోంది.

ఈసారి తనయుడి కోసం కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. దాంతో అక్కినేని ఫ్యామిలీతో పాటుగా అభిమానులు కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. ఈసారి అయ్యగారు బ్లాక్ బస్టర్ హిట్టు కొడతారని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ కెరీర్‌కు 'లెనిన్' ఒక గొప్ప మలుపుగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ జూలై 10న తెల్లవారుజాము ఆటలతో థియేటర్లలోకి రాబోతుండగా.. ఎర్లీ మార్నింగ్ షోల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఓవర్సీస్ అంతటా భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 4:30 గంటలకు షోలు ప్రారంభం కానున్నాయి. ఇండియాలో ఉదయం 5:00 గంటల నుంచి స్పెషల్ షోలు పడనున్నాయి.

English Summary

Akkineni Akhil is acting in the film "Lenin". Directed by Murali Kishore Abbur, the film stars Bhagya Sri Borse as the female lead. Akkineni Nagarjuna and Suryadevara Nagavamsi are jointly producing the film.