తెలుగు చిత్రసీమలోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, చాలా రోజుల తర్వాత నేరుగా తన అభిమానుల ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ శౌర్య భవన్‌లో జరిగిన 'అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్' ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అభిమానులతో ముచ్చటించిన బన్నీ, ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం సాగే 'ట్రోల్స్, హేట్ కల్చర్'పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డబుల్ ధమాకా: రెండు భాగాలుగా అల్లు అర్జున్ 'రాకా'?
నాకు ఒక ఆర్మీ ఉంది
సాధారణంగా ప్రతీ హీరోకూ అభిమానులు ఉంటారని, కానీ తనకు మాత్రం ఒక క్రమశిక్షణ కలిగిన 'ఆర్మీ' ఉందంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు హాలులో ఈలలు, కేరింతలు పుట్టించాయి. అభిమానులు చేస్తున్న వివిధ రకాల సేవా కార్యక్రమాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలపలేకపోయినా, వారంతా తన హృదయంలోనే ఉంటారని పేర్కొంటూ "Keep The Fire On" అంటూ అభిమానుల్లో నయా జోష్ నింపారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?
సోషల్ మీడియా యుగంలో రోజురోజుకూ పెరుగుతున్న నెగెటివిటీ, హేట్ కల్చర్‌పై బన్నీ అత్యంత ప్రాక్టికల్ సందేశాన్ని ఇచ్చారు. ప్రతీ మనిషికి రోజులో పరిమితమైన సమయం, ఎనర్జీ మాత్రమే ఉంటాయని.. మనకు నచ్చని వారిని విమర్శించడానికో, ట్రోల్ చేయడానికో మన సొంత డబ్బును, సమయాన్ని, శక్తిని వృథా చేసుకోవడం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు. ఇతరులను ద్వేషించడానికి బదులు, ఆ ఎనర్జీని మీ సొంత ఎదుగుదల, కుటుంబం, కెరీర్ లక్ష్యాల కోసం ఉపయోగించుకోవాలని హితవు చెప్పారు. ఇదే సమయంలో "ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయండి.. కానీ ద్వేషించకండి. అంతగా కావాలంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందో, లవర్ కోసమో వెయిట్ చేయండి! కనీసం మీకైనా ఆ సమయం ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అంతే తప్ప నచ్చని వ్యక్తుల కోసం ఒక్క శాతం ఎనర్జీ కూడా వేస్ట్ చేయొద్దు" అంటూ బన్నీ సరదాగా ఇచ్చిన పంచ్ అభిమానులను, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ప్రాక్టికల్ సందేశమిచ్చిన బన్నీ