Bigg Boss 10: సెలూన్ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ 10 వరకు.. బుల్లితెర స్టార్ జీవితంలో మరో బిగ్ టర్న్!


Bigg Boss 10: తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో "బిగ్ బాస్" సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ' కంటెస్టెంట్ల ఎంపికపై బుల్లెతెర వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోని ఒకప్పుడు సెలూన్ లో సాధారణ ఉద్యోగిగా పనిచేసి తన కష్టాన్నే పెట్టుబడిగా పెట్టి నేడు సెలబ్రిటిగా మారిన జబర్దస్ట్ కమెడియన్ పవిత్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పవిత్ర ఈ బిగ్ బాస్ సీజన్లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

సాధారణంగా సినిమా, టీవీ రంగాల్లో స్థిరపడిన ఎందరో సెలబ్రిటీల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉంటాయి. ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నవారే నేడు టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో తమను తాము ప్రమోట్ చేసుకొని మంచి మంచి ఆఫర్స్ పట్టేస్తున్నారు. సరిగ్గా అదే జాబితాలోకి వస్తుంది హాట్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ పవిత్ర. స్క్రీన్‌పై ఎప్పుడూ ఎంతో యాక్టివ్‌గా, నవ్వుతూ కనిపించే పవిత్ర.. తన కెరీర్ ప్రారంభింలో కుటుంబ పోషణ కోసం, పొట్టకూటి కోసం ఓ బ్యూటీ సెలూన్‌లో సాధారణ ఉద్యోగిగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు పడింది.

Advertisement

అయితే పవిత్ర జీవితాన్ని అప్పట్లో సంచలనం రేపిన టిక్ టాక్ మార్చేసింది. గతంలో సెలూన్లో పవిత్ర సరదాగా చేసిన టిక్ టాక్ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. పవిత్రలోని కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను అడ్డుకోవడమే కాకుండా.. టెలివిజన్ చరిత్రలోనే సంచలన షోగా మారిన జబర్దస్త్ నిర్వాహకుల దృష్టిలో పడేలా చేశాయి. అలా సామాన్యులను సెలబ్రిటీలుగా మార్చే జబర్దస్త్ వేదికపైకి పవిత్రకు గ్రాండ్ ఎంట్రీ లభించింది.

జబర్దస్త్ ఎంట్రీ లభించిన అనంతరం పవిత్ర తన టాలెంట్‌తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. బుల్లెట్ భాస్కర్, హైపర్ ఆది, వెంకీ మంకీ, రాకెట్ రాఘవ వంటి టీమ్ లీడర్ల స్కిట్లలో నటిస్తూ తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం జబర్దస్ట్ మాత్రమే కాకుండా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి పాపులర్ షోలో అలరించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ గుర్తింపు, సంపాదనతో గతంలో తను పనిచేసిన బ్యూటీ సెలూన్‌ స్థానంలో.. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక లగ్జరీ సొంత ఇంటిని కొనుగోలు చేసి పవిత్ర తన జీవితకాల కలను నిజం చేసుకుంది.

Advertisement

ప్రస్తుతం వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం .. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నిర్వాహకులు పవిత్రను కంటెస్టెంట్ గా హౌస్ లోకి పంపేందుకు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. జబర్దస్ట్ కంటెస్టెంట్లకు బిగ్ బాస్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో ముక్కు అవినాష్, చలాకీ చంటి, ఫటాఫట్ సద్దాం వంటి వారు బిగ్ బాస్ హౌస్‌‌లోకి వెళ్లి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు పవిత్రకు ఉన్న క్రేజ్, ఆమె వెనక ఉన్న స్ఫూర్తిదాయక లైఫ్ స్టోరీ నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే పవిత్ర కెరీర్ కు ఇది ఎంతో ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

English Summary

Bigg Boss 10, Jabardasth comedian Pavithra is rumored to enter Bigg Boss Telugu Season 10. Read about her inspiring journey from a salon worker to a popular TV celebrity.