'జుట్లు పట్టుకొని కొట్టుకున్నాం': తొలి సినిమా సెట్లోనే సహనటుడిని చితకబాదిన బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ డ్యాన్సర్, ప్రముఖ నటి నోరా ఫతేహీ తన గ్లామర్, అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ నోరా ఫతేహీ సినీ ప్రస్థానంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇటీవల ఓ టాక్ షోలో నోరా ఫతేహీ తన తొలి సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ వివాదాస్పద సంఘటనను వెల్లడించింది.

Advertisement

దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం!

నోరా ఫతేహి 2014లో విడుదులైన "రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్" సినిమాతో బాలీవుడ్ నటిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా సినిమా యూనిట్ బంగ్లాదేశ్‌లోని సుందర్‌బన్స్ అడవుల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్లో ఉన్న ఓ కో-స్టార్ ఆమెతో పరిధి దాటి అసహ్యంగా ప్రవర్తించాడని నోరా ఫతేహి వెల్లడించింది. సహనటుడు మర్యాద లేకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేకపోయానని.. వెంటనే అతడి చెంప చెల్లుమనిపించానని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

Advertisement

జుట్లు పట్టుకుని కొట్టుకున్న నటీనటులు
నోరా ఫతేహీ చెంపదెబ్బ కొట్టిన అనంతరం ఆ నటుడు కూడా తగ్గకుండా ఆమెను తిరిగి కొట్టాడని.. దాంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని ఆమె వెల్లడించింది. నోరా కూడా ఆగ్రహంతో మళ్లీ అతన్ని చెంపదెబ్బ కొట్టింది. ఆ నటుడు ఆమె జుట్టు పట్టుకుని లాగడంతో నోరా ఫతేహి కూడా ప్రతిఘటించి అతడి పట్టుకుని గట్టిగా లాగింది. ఆ గొడవ శృతి మించి ఇద్దరి మధ్య పెద్ద కొట్లాటగా మారడంతో సినిమా డైరెక్టర్ కమల్ సదానా వచ్చి వారిని విడదీయాల్సి వచ్చింది.

Advertisement
ఆఫర్లు రిజెక్ట్ చేయడం వెనుక ఉన్నది ఆ ఒక్కటే.. ఓపెన్ అయిన కాజల్!

బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన "యాన్ యాక్షన్ హీరో" సినిమా ప్రమోషన్లలో భాగంగా "ది కపిల్ శర్మ షో"లో పాల్గొన్న సమయంలో నోరా ఫతేహీ ఈ విషయాలను పంచుకుంది. ఈ గొడవ గురించి విన్న కపిల్ శర్మ ఫన్నీగా వ్యాఖ్యానించగా.. ఆ నటుడి ప్రవర్తనపై నోరా ఫతేహీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఆ నటుడి పేరును నోరా ఫతేహీ బహిరంగంగా వెల్లడించలేదు. కమల్ సదానా దర్శకత్వం వహించిన "రోర్:టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్" సినిమాలో అభినవ్ శుక్లా, అలీ కులీ మీర్జా, హిమర్ష వెంకటసామి, అచింత్ కౌర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

English Summary

Actress Nora Fatehi reveals a shocking incident from her debut movie Roar set where she slapped a co-star for misbehaving and had a physical fight.