రియల్ హీరో అనిపించుకున్న సల్మాన్ ఖాన్: ఆ రాష్ట్రానికి బాలీవుడ్ భాయ్‌జాన్ అభయహస్తం!

అస్సాంలో తీవ్ర వరదల కారణంగా వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఉదారతను చాటుకుంటున్నారు. అస్సాం రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకునేందుకు సల్మాన్ ఖాన్ ముందుకొచ్చారు. ప్రస్తుతం ముంబైలో ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్.. అస్సాంలో వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలకు ఆహారం, నిత్యావసర వస్తువులను పంపేందుకు అక్కడి అభిమాన సంఘాలతో సమన్వయం చేస్తున్నారు.

Advertisement
'ది ప్యారడైజ్’: ఐటమ్ సాంగ్‌లో క్రేజీ బ్యూటీ?
Advertisement

అస్సాంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తక్షణ సాయం అందించేందుకు సల్మాన్ ఖాన్ నేరుగా 'సల్మాన్ ఖాన్ ఫ్యాన్ క్లబ్ అస్సాం' ప్రతినిధులతో సంప్రదించి బాధితులకు సహాయం చేయడానికి దశలవారీగా ప్రక్రియను ప్లాన్ చేశారని సమాచారం. అంటే బాధితులందరికీ క్రమబద్ధమైన రీతిలో సాయం అందించడానికి ఓ ప్లాన్‌ను సిద్ధం చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్థాపించిన 'బీయింగ్ హ్యూమన్' స్వచ్ఛంద సంస్థ, ఆయన అభిమాన సంఘం సభ్యులు కలిసి సహాయ కార్యక్రమాలను మూడు దశల్లో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టారు.

మొదటి దశ: ఆహారం, నిత్యావసర వస్తువుల పంపిణీ
మొదటి దశ సహాయ చర్యలో భాగంగా గౌహతి నుంచి శివసాగర్ జిల్లాలోని తీవ్ర ప్రభావిత ప్రాంతాలకు ఆహార ప్యాకెట్లను రవాణా చేస్తున్నారు. ప్రతి ప్యాకెట్లో బిస్కెట్లు, బెల్లం, అటుకులు, మరమరాలు, బ్రెడ్, చీజ్, జామ్ ఉంటాయి. బాధితులకు కనీసం మూడు రోజులకు సరిపడా ఆహారం అందాలనేది సల్మాన్ ఖాన్ ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. వారు శానిటరీ ప్యాడ్‌లు, దోమల కాయిల్స్, తాగునీరు, నీటి శుద్ధి మాత్రలను కూడా పంపిణీ చేస్తున్నారు.

Advertisement
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: రొటీన్ ఫార్ములాను పక్కన పెట్టి బిగ్ రిస్క్?

రెండు, మూడో దశల ప్రణాళిక
రెండో దశలో రేషన్ కిట్లు, మందుల పంపిణీపై దృష్టి సారిస్తారు. ఇది వచ్చే వారం ప్రారంభమవుతుంది. మూడో దశలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల పునర్నిర్మాణ బాధ్యతను బీయింగ్ హ్యూమన్ చేపడుతుంది.

విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన సల్మాన్ ఖాన్
నీట్ పేపర్ లీకులు, పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' నేతృత్వంలో విద్యార్థులు చేపట్టిన నిరసన గురించి సల్మాన్ ఖాన్ స్పందించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన తర్వాత విద్యార్ధులు సురక్షితంగా ఇళ్లకు వెళ్లాలని సల్మాన్ ఖాన్ కోరారు. అలాగే నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్‌ను విరమించుకోవాలని సల్మాన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు.

English Summary

Bollywood star Salman Khan coordinates with Being Human and Assam fan clubs to provide food, essential items, ration kits, and reconstruction aid for flood victims.