అన్నా నీ సినిమాకు ప్రింట్ ఖర్చులు కూడా రాలేదు..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు లెజెండ్ మూవీ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. లెజెండ్ తర్వాత చాలా సినిమాల్లో విలన్ పాత్రలో మెప్పించారు. కొన్ని సినిమాల్లోని ఆయన పాత్రలు సినిమాకు బిగ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచాయి. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో జగపతిబాబు అప్పలసూరి పాత్రకు ప్రాణం పోశారు. ఈ పాత్రను జగ్గూభాయ్ తప్ప మరెవరూ చేయలేరు అనేంతగా అందులో పరకాయ ప్రవేశం చేశారు.

Advertisement

అయితే ఇటీవల జగపతిబాబు ప్రధాన పాత్రలో ఓ సినిమా రిలీజైంది. అదే 'వదలా' మూవీ.. జగపతిబాబు, లయ విజయవంతమైన జోడీ. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వీరిద్దరూ కలిసి వదలా సినిమా చేశారు. ఇదో సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. జగపతిబాబు, లయతో పాటు హ్రితిక శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 17 న విడుదలైంది. వదలా మూవీకి ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహించారు. కిషోర్ నాయుడు చిరు మామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా నిర్మించారు.

Advertisement

ఈ మూవీ స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే ఇటీవల హాలీవుడ్ లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అబ్సెషన్ మూవీ మాదిరి ఉంటుంది. యోగి(జగపతిబాబు), ప్రియ(లయ) దంపతులు. వీరు తమ పిల్లలతో కలిసి మధ్యప్రదేశ్ లోని ఓ నగరంలో ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. యోగి వృత్తిరిత్యా ఓ డాక్టర్. అతని జీవితంలోకి ఆముద అనే 20 ఏళ్ల అమ్మాయి వస్తుంది.

ఎందుకంటే తనకు గతంలో యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది యోగినే కాబట్టి. ఫ్రెండ్ గా యోగి లైఫ్ లోకి ప్రవేశించిన ఆముద.. ఆ తర్వాత క్రమంగా సైకోగా మారి, క్రైమ్స్ చేసే దాకా వెళ్తుంది. అసలు వయసులో చాలా పెద్ద అయిన యోగి మీద ఆ అమ్మాయి ఎందుకు అంతగా మనసుపడింది..? చివరికి ఏం జరిగింది..? అనేదే మూవీ స్టోరీ..

Advertisement

అయితే ఈ మూవీ అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే, సీన్స్ కారణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు కనీసం ప్రింట్ ఖర్చులు కూడా రీకవర్ అవ్వలేదని తెలుస్తోంది. హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించి ఒక్క షో కూడా లేకపోవడం గమనార్హం.