175 రోజులు పూర్తి చేసుకున్న చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'.. సెంటర్స్ లిస్ట్ ఇదే..!


ఇటీవలికాలంలో ట్రెండ్ మారింది.. అప్పట్లో ఓ సినిమా ఇన్ని రోజులు ఆడితే గొప్ప.. ఇప్పుడు ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే గొప్ప.. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా వారం పది రోజుల కంటే ఎక్కువ కాలం థియేటర్లలో ఆడింది లేదు. సినిమా బాగుంటే రెండు వారాలు.. లేకపోతే మూడు రోజుల్లోనే కనుమరుగవుతున్నాయి. మరోవైపు ఇప్పుడు ఓటీటీ కాలం నడుస్తోంది. చాలా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుండగా.. ఇంకొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజై ఆ తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే 100 రోజులు పూర్తి చేసుకుంటున్నాయి.

Advertisement

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ ఏకంగా 175 రోజులు పూర్తిచేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఇలాంటి అరుదైన ఘనతలు కేవలం మెగాస్టార్ చిరంజీవికే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ టాలీవుడ్ లోని దాదాపు అన్ని రికార్డుల్ని చెరిపేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ లక్ష్యంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఓజీ, దేవర, సలార్ చిత్రాలను వెనక్కు నెట్టి బాక్సాఫీస్ వద్ద చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి చూపించింది. ఏకంగా రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Advertisement

ఇక 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత రాయలసీమలోని రెండు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కడప జిల్లా మైదుకూరులోని వెంకటేశ్వర థియేటర్ లో ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే యర్రగుంట్ల సెంటర్ లోని హేమ పిక్చర్ ప్యాలెస్ లో కూడా ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ హేమ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ లోనే ఏకంగా 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితం అయింది. దాంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవల పొల్లాచ్చి లో ఓ కీలక షెడ్యూల్ కూడా పూర్తయింది. అంతేకాక యంగ్ దర్శకుడు వశిష్టతో విశ్వంభరలో నటిస్తున్నారు. వీటితోపాటు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలోనూ చిరంజీవి పవర్ ఫుల్ హీరోగా చేస్తున్నారు. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమా థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకోవడంపై అటు టాలీవుడ్ అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.