చెల్లికి కాబోయే భర్తతో ఎఫైర్.. రొమాన్స్‌తో ఓటీటీని షేక్ చేస్తున్న స్టార్ బ్యూటీ !!


ప్రస్తుత కాలంలో ఓటీటీ (OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన సినిమా 15 నుంచి 20 రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తుండటంతో, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లోనే సినిమా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ఖర్చుతో కుటుంబమంతా కలిసి సినిమా చూసే అవకాశం ఉండటంతో, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి మూవీ ఓటీటీలో ట్రెండింగ్ గా మారింది. పాత సినిమా అయినప్పటికీ.. మూవీ స్టోరీ, స్టార్ బ్యూటీ రొమాన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవడంతో ఆ మూవీ హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

ఏం మూవీ అంటే..

ఆ సినిమా పేరే "Gehraiyaan". శకున్ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2022 ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, యంగ్ బ్యూటీ అనన్య పాండే.. యంగ్ హీరో సిద్దార్థ్ చతుర్వేది ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించారు. పాత్రల ఎంపికలో పర్టిక్యులర్ గా ఉండే దీపికా.. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు పెద్దపీట వేస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో బంధాల్లోని చీకటి కోణాలను బయటపెట్టే ఈ బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామాను సెలక్ట్ చేసుకుందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కుర్రాళ్లకు కావలసినంత హాట్ సీన్స్ తో అందర్నీ ఫిదా చేసేసింది ఈ ముద్దుగుమ్మ.

Advertisement

సినిమా స్టోరీ..

కాగా ఆరేళ్లుగా కరణ్ (ధైర్య కర్వా)తో సహజీవనం (Live-In Relationship) చేస్తున్న అలీషా (దీపికా) జీవితం.. తన కజిన్ టియా (అనన్యా పాండే), ఆమె కాబోయే భర్త జైన్ (సిద్ధాంత్ చతుర్వేది) రాకతో ఊహించని మలుపు తిరుగుతుంది. టియా ఆహ్వానం మేరకు ఒక ట్రిప్‌కు వెళ్లిన ఈ నాలుగు పాత్రల మధ్య అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ ట్రిప్‌లో జైన్, అలీషాల మధ్య ఏర్పడిన ఆకర్షణ చివరకు అక్రమ సంబంధానికి దారితీస్తుంది. టియాకు విడాకులు ఇచ్చి, అలీషాతో సంతోషంగా ఉంటానని జైన్ మాటిస్తాడు.

Advertisement

అయితే జైన్ వ్యాపారంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అతడి కంపెనీలో టియా తండ్రి కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టడం వల్ల అతను టియాను వదిలి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా ఆమెకు చెందిన మరో భారీ ఆస్తిని అమ్మేయాలని జైన్ కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో అలీషా గర్భవతి కావడం, జైన్ మోసాలు నెమ్మదిగా బయటపడటంతో చివరకు ఏం జరుగుతుంది అనేది సినిమా స్టోరీ.

అయితే ఈ మూవీలో దీపికా పదుకొణె తనకంటే వయసులో చిన్నవారైన సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వాలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా సిద్ధాంత్ చతుర్వేదితో ఆమె చేసిన రొమాంటిక్, లిప్ లాక్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు కొందరు గట్టిగానే ట్రోల్ కూడా చేశారు. కానీ అవేం పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ కెరీర్ కొనసాగిస్తుంది దీపికా.

English Summary

There is no need to mention how much the OTT trend is going on these days. With a movie released in theaters coming to OTT within 15 to 20 days, audiences are more inclined to watch movies at home than going to theaters.