కళ్లు చెదిరే ధనుష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఒక్కప్పుడు అతని రూపం చూసి గేలి చేశారు.. "వీడు హీరో ఏంటి?" అని పెదవి విరిచారు! కానీ, అదే వ్యక్తి తన అసాధారణ నటనా ప్రాభవంతో, పట్టుదలతో కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన జెండా పాతాడు. ఆయనే గ్లోబల్ స్టార్ ధనుష్! ఈరోజు తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ ఇండస్ట్రీలోనే అరుదైన నటుడిగా సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాడు.

Advertisement
ధనుష్ పొలిటికల్ ఎంట్రీ- ఫ్యాన్స్ కు పిలుపు: లేటెస్ట్ అగ్రెసివ్ వీడియో
Advertisement

అవమానాల నుంచి అద్భుత విజయాల వైపు

కస్తూరి రాజా దర్శకత్వంలో వచ్చిన 'తుళ్లువదో ఇళమై' చిత్రంతో ధనుష్ వెండితెరకు పరిచయమయ్యారు. ప్రారంభంలో ఎదురైన బాడీ షేమింగ్, ట్రోల్స్ ఏమాత్రం ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. నటననే ఆయుధంగా మలచుకుని 'కాదల్ కొండేన్' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'పుదుపేట్టై', 'పొల్లాదవన్', 'ఆడుకాలం', 'అసురన్' చిత్రాలు ధనుష్‌ను భారతదేశపు అత్యుత్తమ నటులలో ఒకరిగా నిలబెట్టాయి. 'ఆడుకాలం', 'అసురన్' సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాలను అందుకోవడమే కాకుండా, నటుడిగానే కాక దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, గేయ రచయితగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. 'రఘువరన్ బిటెక్', 'సార్' వంటి విజయాలతో తెలుగు ప్రేక్షకులలోను, 'ది గ్రే మ్యాన్'తో హాలీవుడ్‌లోనూ చెరగని ముద్ర వేశారు.

Advertisement
దళపతి విజయ్ బాటలో ధనుష్.. కొత్త పార్టీ.. స్టాలిన్‌తో భేటీ

రూ.250 కోట్ల సామ్రాజ్యం.. మైండ్ బ్లాకింగ్ లైఫ్‌స్టైల్!

నటుడిగా, నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్‌గా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న ధనుష్ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.250 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. తమిళనాట అత్యంత విలాసవంతమైన ప్రాంతమైన చెన్నైలోని 'పోయెస్ గార్డెన్' లో సూపర్ స్టార్ రజినీకాంత్ నివాసానికి సమీపంలో 19,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ రాజప్రాసాదాన్ని నిర్మించుకున్నారు. ఈ ఇంటి విలువ సుమారు రూ. 150 కోట్లు! కార్లంటే ఎంతో ఇష్టపడే ధనుష్ గ్యారేజ్‌లో రోల్స్ రాయిస్, బెంట్లీ, ఫోర్డ్ మస్టాంగ్ వంటి ఖరీదైన గ్లోబల్ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్వయంకృషితో ఎదిగిన ప్రతి ఒక్కరికీ ధనుష్ ప్రయాణం ఒక నిదర్శనం. "రూపం ముఖ్యం కాదు, ప్రతిభే అసలైన గుర్తింపు" అని చాటిచెప్పిన ఈ గ్లోబల్ స్టార్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు!

English Summary

Dhanush owns numerous assets, including a house worth ₹150 crore and cars worth several crores. Dhanush, who is set to enter politics soon, is celebrating his birthday.