ఫ్లాప్ సినిమాలే ఇండస్ట్రీకి మేలు చేస్తాయి.. టాలీవుడ్‌పై RGV సెన్సేషనల్ కామెంట్స్!

Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ) కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. తన కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. సమాజం, సినీ ఇండస్ట్రీలోని పలు అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ వివాదాస్పద పోస్టులతో అందరినీ ఆలోచింపజేయడం ఆర్జీవీ ప్రత్యేకత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ.. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై చేసిన సెన్సేషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Advertisement
చాలాసార్లు ఆఫర్ వచ్చింది.. బిగ్ బాస్‌కు మళ్లీ 'నో’ చెప్పిన టాలీవుడ్ హీరోయిన్!
Advertisement

టాప్ హీరోయిన్ ఉదాహరణతో ప్లానింగ్ లోపం రట్టు
సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్న అసలు సమస్య ఫ్లాప్ సినిమాలు కాదని.. ప్రణాళిక రాహిత్యం, నిర్మాణ సమయంలో చూపే బాధ్యతారాహిత్యమేనని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తన మాటలను నిరూపించుకోవడానికి ఆర్జీవీ ఓ షాకింగ్ ఉదాహరణను వెల్లడించారు.టాలీవుడ్ లోని ఓ టాప్ హీరోయిన్ ఒక సినిమా షూటింగ్ కోసం ఏకంగా 10 రోజుల పాటు సెట్స్‌లోనే ఉండిపోయారని.. కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఆమె కేవలం ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. అయితే ప్లానింగ్ లోపం వల్ల 9 రోజులు వృథా అయినప్పటికీ.. ఆ హీరోయిన్ కు ఇచ్చే రెమ్యునరేషన్‌లో ఎలాంటి కోత పడలేదని.. చెప్పిన పూర్తి పారితోషికాన్ని ఆమె వసూలు చేసుకుందని ఆర్జీవీ సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఇటువంటి నిర్లక్ష్యం వల్లే నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు.

Advertisement

ఫ్లాప్ చిత్రాల వల్లే సినీ పరిశ్రమకు మేలు!
ఇదిలా ఉండగా.. ఫ్లాప్ సినిమాల వల్ల సినీ ఇండస్ట్రీకి జరిగే మేలు గురించి చెబుతూ రామ్ గోపాల్ వర్మ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వాటి నిర్మాణ ప్రక్రియ వల్ల ఇండస్ట్రీలో డబ్బు నిరంతరం చలామణి అవుతూనే ఉంటుందని వెల్లడించారు. ఓ సినిమా ఫ్లాప్ అయినా కూడా దాని ద్వారా సాంకేతిక నిపుణులు, దినసరి కూలీలు, టెక్నీషియన్లు, చిన్న చిన్న నటులకు ఉపాధి దొరికి వారి ఇల్లు గడుస్తుందని ఆర్జీవీ అన్నారు. కానీ ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మాత్రం.. దాని ద్వారా వచ్చే భారీ లాభాలు కేవలం సదరు నిర్మాతలు, స్టార్ హీరోల జేబుల్లోకి వెళ్తాయని ఆర్జీవీ స్పష్టం చేశారు. అందువల్ల ఇండస్ట్రీని ముంచుతోంది ఫ్లాప్ సినిమాలు కాదని.. హీరోలు, నిర్మాతల ప్రణాళికా లేమి, నిర్లక్ష్యమేనని తేల్చి చెప్పారు.

Advertisement
Nithiin: శృంగార నవలలు రాసే 'అలియాస్ రుక్మిణి': ఈసారి కాన్సెప్ట్ మామూలుగా లేదుగా!

సోషల్ మీడియా వేదికగా మొదలైన కొత్త చర్చ
ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపాయి. నెటిజన్లలో కొందరు రామ్ గోపాల్ వర్మ కామెంట్లను సమర్థిస్తూ.. నిర్మాతలు ప్లానింగ్ లేకుండా కోట్లు తగలేస్తున్న మాట వాస్తవమేనని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఆయన కామెంట్లను తప్పుపడుతున్నారు. ఈ రోజుల్లో కొందరు స్టార్ హీరోలు ప్రాజెక్టు ప్రాధాన్యతను బట్టి పారితోషికం తీసుకోకుండా లేదా లాభాల్లో వాటా తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారని.. అందరినీ ఒకేలా చూడటం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

English Summary

Director Ram Gopal Varma makes sensational comments on Tollywood financial system, claiming flop movies keep workers employed while bad planning ruins producers.