పగలు ఆడ.. రాత్రయితే మగాడిలా.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ..!


ఇటీవలి కాలంలో ప్రేక్షకుల అభిరుచి, సినిమా చూసే విధానం మారింది. పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా కంటెంట్ లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. అప్పట్లో పెద్ద హీరో సినిమా అంటే థియేటర్ల వద్ద క్యూ ఉండేది. సినిమా హిట్- ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆడేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. కంటెంట్ కే ప్రేక్షకులు జై కొడుతున్నారు. సినిమాలో సత్తా ఉంటే చిన్న సినిమా అయిన నెత్తిన పెట్టుకుంటున్నారు. మరోవైపు ఓటీటీ బాగా పెరిగిపోయింది. జనాలు థియేటర్లలోకి వచ్చి సినిమా చూడాలంటే ఆ సినిమా హిట్ అయితేనే వస్తున్నారు. యావరేజ్ టాక్ వచ్చినా ఓటీటీలో చూడొచ్చులే అని లైట్ తీసుకుంటున్నారు. అందువల్ల ఇటీవలి కాలంలో కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సినిమాలు వస్తున్నాయి.

Advertisement

మూవీలో ఏదైనా కొత్తదనం ఉంటే అది ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయి పోతుంది. అలా ఇటీవల థియేటర్లలో విడుదలై యూత్ ను ఆకట్టుకున్న చిన్న సినిమా 'డబుల్ ఆక్యుపెన్సీ'.. ఈ మూవీలో ఓ షాకింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటి..? అంటే ఒకే వ్యక్తి 12 గంటలకు ఒకసారి అబ్బాయిగా, మరో సారి అమ్మాయిగా మారిపోయే కాన్సెప్ట్.. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మూవీ జూన్ 12 న థియేటర్లలో విడుదలైంది. అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.

Advertisement

ముఖ్యంగా డబుల్ ఆక్యుపెన్సీ మూవీ సైన్స్ ఫిక్షన్ కావడంతో యువతను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీలో సంతోష్, రేష్మా వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే వీరితో పాటు సంయుక్త విశ్వనాథన్, వినోద్ కిషన్, వీటీవీ గణేష్, ఖుష్బూ సుందర్, విచ్చు విశ్వనాథ్ కీలక పాత్రల్లో మెరిశారు. ఈ మూవీకి అశ్విన్ కందస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. ఇక ప్రముఖ నటి, నిర్మాత ఖుష్బూ సుందర్ (అవ్ని సినిమాస్ బ్యానర్), బెంజ్ మీడియా సంయుక్తంగా నిర్మించారు. జూలై 10 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని ఇప్పుడే చూసేయండి..