కట్ చెప్పినా ఆగని హీరోయిన్.. యంగ్ హీరోలను ముద్దులతో ముంచెత్తిన వైనం..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శ్రీలంకకు చెందిన ఈమె 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక కిరీటాన్ని గెలుచుకుని మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో స్పెషల్ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో దుమ్మురేపిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మర్దర్ 2, హౌస్‌ఫుల్ 2, రేస్ 2, కిక్, హౌస్‌ఫుల్ 3, జుద్వా 2 వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. అలానే ప్రభాస్ నటించిన సాహోలో స్పెషల్ సాంగ్ చేసి తెలుగులో కూడా క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

అయితే సినిమాల కంటే కూడా పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది ఈ భామ. ముఖ్యంగా ఆర్థిక మోసాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ తో ఆమె పేరు కలిసి రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలుమార్లు ఆమెను విచారించింది. సుకేశ్ పంపిన ఖరీదైన బహుమతులు, లగ్జరీ కార్లు, ఆభరణాలు, విదేశీ ట్రిప్‌లు వంటి అంశాలు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. జైలులో ఉన్నప్పటికీ సుకేశ్ తరచూ జాక్వెలిన్ పేరుతో లేఖలు విడుదల చేస్తుండటం కూడా చర్చనీయాంశమవుతోంది.

Advertisement

వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ..

ఇదిలా ఉంటే ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్ నిర్వహించిన టాక్ షోలో పాల్గొన్న ప్రముఖ మీడియా సంస్థ హెడ్ సిమి చందోక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో దర్శకుడు "కట్" చెప్పిన తర్వాత కూడా కొందరు నటీనటులు కిస్సింగ్ సీన్స్‌ను కొనసాగిస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా సిమి, జాక్వెలిన్ గురించి రెండు సంఘటనలు ప్రస్తావించారు. A Gentleman షూటింగ్ సమయంలో... సిద్ధార్థ్ మల్హోత్రాతో లిప్‌లాక్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకుడు "కట్" చెప్పిన తర్వాత కూడా జాక్వెలిన్ వెంటనే ఆగలేదని, కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా ఇద్దరూ కొద్దిసేపు అలాగే కొనసాగారని సిమి పేర్కొన్నారు.

Advertisement

అలాగే టైగర్ ష్రాఫ్తో కలిసి నటించిన A Flying Jatt సినిమా షూటింగ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగిందని సిమి తెలిపారు. దర్శకుడు పలుమార్లు "కట్... కట్... కట్" అని పిలిచినా, జాక్వెలిన్ కొద్దిసేపు ఆ సన్నివేశాన్ని కొనసాగించారని ఆమె వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా "సుకేశ్ లాంటి వ్యక్తిని కూడా ముద్దుపెట్టుకోగలిగిన జాక్వెలిన్‌కు సిద్ధార్థ్ మల్హోత్రా, టైగర్ ష్రాఫ్ లాంటి హ్యాండ్సమ్ హీరోలతో నటించడం పెద్ద విషయం కాదేమో" అంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

English Summary

Bollywood star heroine Jacqueline Fernandez needs no introduction. The Sri Lankan-born actress entered the modeling industry after winning the Miss Universe Sri Lanka crown in 2006.