ఒకే రోజు.. రెండు సినిమాలు.. కీర్తి సురేష్‌ బిగ్ సర్‌ప్రైజ్!

ఈ ఏడాది సెప్టెంబర్‌లో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఓ ఆసక్తికరమైన పోటీకి రంగం సిద్దమైది. అన్నీ షెడ్యూల్ ప్రకారం జరిగితే.. నేచరల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్', స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'డొరొతి' సినిమాలు ఒకే రోజున విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఈ సినిమాల రిలీజ్ తేదీల విషయానికి వస్తే.. నాని నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ది ప్యారడైజ్' సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు కీర్తి సురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'డొరొతి' కూడా సెప్టెంబర్ 25న విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు పోటీలు పడుతుండటంతో ప్రేక్షకులు ఏ సినిమాకు ఓటెస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే..!
Advertisement

ఇదిలా ఉండగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్'సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌తో అభిమానులను అలరించనున్నారు. దీంతో కీర్తి సురేష్ ఒకే రోజున రెండు చిత్రాలను ప్రేక్షకులను పలకరించనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హీరోయిన్‌గా.. మరోవైపు స్పెషల్ సాంగ్ తో అలరించనున్న కీర్తికి ఈ రెండు సినిమాలు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయోనని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. సినీ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత

ఈ రెండు చిత్రాలు వేర్వేరు జానర్లలో, విభిన్నమైన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకుంటున్నాయి. నాని తన ప్రజాదరణ, మాస్ అప్పీల్‌తో 'ది ప్యారడైజ్' ద్వారా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. డొరొతి'సినిమా కీర్తి సురేష్ నటన, బలమైన కథాంశంతో విమర్శకుల ఆదరణను పొందడానికి ప్రయత్నిస్తోంది.

English Summary

Keerthy Suresh is set for a double release on September 25 with her lead movie Dorothy and a special song appearance in Nani's mass action entertainer The Paradise.