ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. వరుస హిట్స్ తో యువతను అలరిస్తూ దూసుకెళ్తున్నారు కిరణ్ అబ్బవరం. సాఫ్ట్ వేర్ జాబ్ ను వదిలి సినిమాల్లోకి వచ్చారు ఆయన. యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ రాజావారు.. రాణిగారు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సమ్మతమే, దిల్ రూబా, మీటర్, వినరో భాగ్యము విష్ణు కథ లాంటి సినిమాలతో పర్వాలేదు అనిపించినా.. ఆ తర్వాత క, కే-ర్యాంప్ చిత్రాలతో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టారు. అలా సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగారు కిరణ్ అబ్బవరం.
అటు నిర్మాతగానూ మారి తిమ్మరాజుపల్లి టీవీ సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ విడుదలకు సిద్ధమైంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ అందించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. మరి కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా..? మూవీ టాక్ ఎలా ఉంది..?
కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' సెన్సార్ రివ్యూ: అన్న హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడుగా..
చెన్నై లవ్ స్టోరీ మూవీ ఇటీవలె సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఒక్క సెన్సార్ కట్ కూడా పడకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మధ్యకాలంలో జీరో సెన్సార్ కట్ పడకుండా వచ్చిన సినిమా ఇదే కావడం విశేషం. రన్ టైమ్ దాదాపు 3 గంటలు ఉంది. లవ్ స్టోరీకి దాదాపు 3 గంటలు రన్ టైమ్ ఉండటం సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో చూడాలి..
రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను.. తేల్చి చెప్పిన మల్లు బ్యూటీ..!
ఈ మూవీ క్లీన్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. సినిమా మొత్తం లవ్, ఎమోషనల్ డ్రామా ప్రధానంగా సాగుతుందని టాక్ వినిపిస్తోంది. స్టీవెన్ శంకర్(కిరణ్ అబ్బవరం) సినిమాల్లోకి రావాలన్న ఆశతో చెన్నై వెళ్తాడు. అయితే అప్పటికే లవ్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న అమ్మాయి శ్రీ గౌరి ప్రియను కలుస్తాడు. మొదట శంకర్ ను ఆ అమ్మాయి దూరం పెట్టినా ఆ తర్వాత ఇద్దరూ లవ్ లో పడతారు. మరి గౌరి ప్రియ ఫస్ట్ లవ్ ఏంటి..? ఫస్ట్ లవ్ కంటే రెండో లవ్ ఎందుకు గొప్పది..? చివరకు ఏం జరిగింది..? అనే ఆసక్తికర కథాంశంతో దర్శకుడు స్టోరీని రాసుకున్నాడు.
ఇక ఫస్టాఫ్ హీరో- హీరోయిన్ మధ్య ట్రాక్, కామెడీతో సరదాగా సాగుతుందట. ఆ తర్వాత సీరియస్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందని టాక్. అది చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. ఇక సినిమాలో హీరోకు సంబంధించి బిగ్ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఆడియన్స్ ఆ ట్విస్ట్ కు కనెక్ట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుందని లేకపోతే తేడా కొడుతుందని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా యూత్, ఫ్యామిలీస్ కు నచ్చే విధంగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక చెన్నై లవ్ స్టోరీ మూవీ ఫుల్ రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే..