మల్లూ బ్యూటీకి బహిరంగంగా క్షమాపణ చెప్పిన బడా వ్యాపారవేత్త..

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో.. ముఖ్యంగా మలయాళ చిత్రసీమలో నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది "హనీ రోజ్". మలయాళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగు ఇండస్ట్రీకి మాత్రం కొద్ది కాలం క్రితమే పరిచయమయ్యారు. తెలుగులో మొదట్లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమా ఆమె కెరీర్‌ను టాలీవుడ్‌లో పూర్తిగా మార్చేసింది. ఈ ఒక్క సినిమా విజయంతో హనీ రోజ్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.

Advertisement

హనీ రోజ్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ ఈవెంట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కడ పెద్ద షాపింగ్ మాల్స్ లేదా జ్యువెలరీ షోరూమ్స్ ఓపెనింగ్స్ జరిగినా హనీ రోజ్ లక్కీ హ్యాండ్‌గా నిలుస్తున్నారు. ఆమెను చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు తరలిరావడం విశేషం. దీనికి తోడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే ట్రెడిషనల్ చీరకట్టు ఫోటోలు మరియు మోడరన్ లుక్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతూ తెలుగు యూత్‌ను కట్టిపడేస్తున్నాయి.

Advertisement

అయితే కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ హీరోయిన్ హనీ రోజ్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఒక జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ వేడుకలో హనీ రోజ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తనపై లైంగిక భావనలతో కూడిన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చెమ్మనూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.

ఈ నేపథ్యంలో, బాబీ చెమ్మనూర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ, తన వ్యాఖ్యలు హనీ రోజ్‌ను, ఆమె కుటుంబాన్ని బాధపెట్టాయని గ్రహించానని... ఈ ఉదంతానికి పూర్తి బాధ్యత వహిస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ప్రకటించారు. ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని, ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అలాగే ఆమె తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

మరోవైపు ఈ వివాదంపై గతంలో మాట్లాడిన హనీ రోజ్... తన లుక్స్‌పై వచ్చే సరదా జోకులను, మీమ్స్‌ను తాను కూడా స్పోర్టివ్‌గా తీసుకుంటానని, కానీ ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని స్పష్టం చేశారు. అసభ్యకరమైన, గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను ఏమాత్రం సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. వ్యాపారవేత్త చెమ్మనూర్ చేసిన ఈ బహిరంగ క్షమాపణలపై హనీ రోజ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

English Summary

"Honey Rose" has earned a special recognition as an actress in the South Indian film industry, especially in the Malayalam film industry. Although Honey Rose has acted in many successful films in Malayalam, she was introduced to the Telugu industry only recently.