ఓటీటీలో ట్రెండ్ అవుతున్న నాగ‌దుర్గ క్రేజీ మూవీ.. చూసి తీరాల్సిందే..!

తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నాగదుర్గ. అటు ఫోక్ సింగర్ గా ఇటు డ్యాన్సర్ గా ఆమె దూసుకెళ్తున్నారు. అయితే ఇటీవల నాగ‌దుర్గ హీరోయిన్‌ గా న‌టించిన త‌మిళ మూవీ 'ల‌వ్ ఓ ల‌వ్' ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న హాలీవుడ్ సినిమాలను సైతం దాటేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

Advertisement

హయ్యెస్ట్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. 'ల‌వ్ ఓ ల‌వ్' మూవీలో కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌వీష్ హీరోగా న‌టించాడు. ఈ మూవీకి తమిళ్ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ లో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన కేవలం ఐదు రోజుల్లోనే రెండు మిలియ‌న్ల‌కుపైగా స్ట్రీమింగ్ మిన‌ట్ వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీతోనే తెలంగాణ ఫోక్ క్వీన్ నాగదుర్గ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు రూ. 8 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కింది. కానీ కలెక్షన్స్ మాత్రం రూ. కోటి లోపే రాబట్టి డిజపాయింట్ చేసింది.

Advertisement

కానీ 'ల‌వ్ ఓ ల‌వ్' మూవీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ మూవీని ద‌ర్శ‌కుడు మ‌గీష్ రాజేంద్ర‌న్ రొమాంటిక్ లవ్ డ్రామాగా తెరకెక్కించారు. ప్రేమ‌, పెళ్లి లాంటి విష‌యాల్లో యువ‌త ఆలోచ‌న‌లు ఎలా ఉంటున్నాయ‌నే పాయింట్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే రఘు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అప్పు చేయడం అతనికి నచ్చదు. అయితే రఘు అవంతితో ప్రేమలో పడతాడు. అయితే ర‌ఘు డ‌బ్బుల‌తో అవంతిక జ‌ల్సాలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అవంతిక కారణంగా కుటుంబానికి దూరమైన రఘు దుబాయ్ పారిపోవాలని ప్రయత్నిస్తాడు. కానీ మహిళా మండలి నాయకురాలు పెట్టిన కేసుతో జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది ? అనేదే సినిమా..